మంత్రి ఈటల హామీతో ప్రారంభమైన ఆరోగ్య శ్రీ సేవలు

Wed,August 21, 2019 11:49 PM

మయూరిసెంటర్ : రాష్ట్ర వ్యాప్తంగా నెట్‌వర్క్ ప్రైవేటు వైద్యశాలలు ఆరోగ్యశ్రీ సేవలను అందిస్తూ వస్తున్నాయి. కాగా పెండింగ్‌లో ఉన్న ఆరోగ్యశ్రీ బిల్లులను విడుదల చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త బంద్‌లో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 16ప్రైవేటు ఆసుపత్రులు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏడు ప్రభుత్వ వైద్యశాలలు ఆరోగ్య శ్రీ సేవలు అందిస్తున్నాయి. 16ప్రైవేటు వైద్యశాలలు గత ఆరురోజుల నుంచి బంద్‌లో పాల్గొనగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి ఈటల రాజేందర్ ఈ నెల 20వ తేదీన హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ఇచ్చిన హామీతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు వైద్యశాలల్లో ఆరోగ్యశ్రీ సేవలు ఈ నెల 21వ తేదీ నుంచి పునఃప్రారంభమయ్యాయి. 30రోజులలో ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల చేయిస్తామని మంత్రి హామీ ఇవ్వడంతో ప్రైవేటు వైద్యశాలల యాజమాన్యాలు బంద్‌ను విరమించాయి.

34
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles