వయ్యారిభామను సమూలంగా నాశనం చేయాలి

Wed,August 21, 2019 11:49 PM

సుజాతనగర్ : వయ్యారిభామ (పార్థీనియం) మొక్కలను సమూలంగా నాశనం చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ణాన కేంద్రం ప్రోగ్రామింగ్ కో ఆర్డినేటర్ డాక్టర్ జీ వీరన్న అన్నారు. బుధవారం మండల పరిధిలోని సర్వారంలో గల ప్రభుత్వ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ ఉన్నత పాఠశాల విద్యార్థులకు వయ్యారిభామ(పార్థీనియం)మొక్క గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు వయ్యారిభామను సమూలంగా నాశనం చేయాలని, మొక్కవలన కలుగు అనర్థాల గురించి వివరించారు. ఈ మొక్క చాలా ప్రమాదకరమైనదని, దీని వలన మనుషులకు, జంతువులకు, పంట మొక్కలకు అపారమైన నష్టం వాటిల్లుతుందని అన్నారు. మనషులు నివసించే ప్రాంతాలలో ఈ మొక్క ఉండటం వల్ల తుమ్ములు, చర్మ, శ్వాస సంబంధిత వ్యాధులు, విష జ్వరాలు ప్రభలే ప్రమాదం ఉందన్నారు. మొలిచిన వయ్యారిభామను పూత పూయక ముందే వేళ్లతో సహా పీకి తగుల పెట్టాలని విదార్థులకు తెలిపారు. కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు శివ, మిల్దాపాల్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, టీచర్లు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

37
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles