సేవా దృక్పథంతో పని చేయండి

Wed,August 21, 2019 01:01 AM

-తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం చిన్నచూపు..!
-భద్రాచలం రైల్వై లైన్‌కు కృషి చేస్తా
-భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల అభివృద్ధికోసం మరిన్ని చర్యలు
-అభివృద్ధిలో ‘పేట’ రాష్ట్రంలోనే ఆదర్శం కావాలి
-అధికారులకు ఖమ్మం ఎంపీ ‘నామా’ సూచన

అశ్వారావుపేట, నమస్తే తెలంగాణ : ప్రజల కోసం పని చేస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయం చేసుకోవాలని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు సూచించారు. సామాజిక సేవా దృక్పథంతో ప్రజా సమస్యలను పరిష్కరించటంతో పాటు అభివృద్ధి కోసం పని చేయాలని ఆదేశించారు. స్థానిక శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్‌ హాల్‌లో మంగళవారం ఆయన నియోజకవర్గ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులనుద్దేశించి మాట్లాడారు. టీం వర్క్‌తో పని చేస్తే ప్రభుత్వం ఆశించిన అభివృద్ధిని సాధించటమే కాకుండా ప్రజల సమస్యలను పరిష్కరించటం సులభం అవుతోందని అన్నారు. ముందుగా 13 ప్రధాన ప్రభుత్వ శాఖల అధికారులతో ప్రగతి, అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లాల కో-ఆర్డినేటర్‌ తూతా నాగమణి, నియోజకవర్గ మండలాల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పంచాయయితీ రాజ్‌ శాఖలో జరుగుతున్న అభివృద్ధిని అశ్వారావుపేట డీఈఈ శ్రీనివాసరావును అడిగి తెలుసుకున్నారు. మొత్తం నియోజకవర్గ మండలాల్లో 93 పనులు జరుగుతున్నాయని, వీటిలో ఇప్పటికే 90 పనులు పూర్తి కాగా మరో రెండు పనులు వివిధ కారణాలను రద్దు అయ్యాయని, మిగతా ఒక పని ప్రొగ్రెస్‌లో ఉందని వివరించారు. ములకలపల్లి డీఈ సత్యనారాయణ తన పరిధిలో 89 పనులు మంజూరు కాగా 15 పనులు ప్రారంభించాల్సి ఉందని వివరించారు. మైనర్‌ ఇరిగేషన్‌ శాఖలో చేపడుతున్న అభివృద్ధి పనులను డీఈఈ ఎల్‌ కృష్ణ ఎంపీకి వివరించారు. పెదవాగు ప్రాజెక్టు మరమ్మతులకు రూ.78 కోట్లతో ప్రతిపాదనలు పంపించామని, నిధులు మంజూరు కాలేదని, దీనివల్ల తెలంగాణ, ఏపీలోని 16 వేల ఎకరాలకు సాగునీరు అందించటానికి సమస్యను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. సీతారామ ప్రాజెక్టు పనులు పురోగతిలో ఉన్నట్లు ఆ శాఖ అధికారులు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. 114 కిలో మీటర్లు మేర 28 ప్యాకెజీల్లో పనులు చేపడుతున్నామని అన్నారు. మొత్తం 1850 ఎకరాల భూ సేకరణకు గాను ఇప్పటి వరకు 1580 ఎకరాల భూమిని సేకరించామని, మరో 275 ఎకరాల భూ సేకరణ క్లిష్టతరంగా ఉందని, పరిహారం కూడా చెల్లించటం జరిగిందని ఎంపీకి వివరించారు. మిగిలిన అన్ని శాఖలు విద్యా, వైద్యం, విద్యుత్‌, మిషన్‌భగీరథ, రెవెన్యూ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.

బూర్గంపహాడ్‌ : ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారిని దర్శించుకునేందుకు మంగళవారం భద్రాచలం వచ్చారు. దర్శనం అనంతరం ఎంపీ బూర్గంపహాడ్‌ సర్పంచ్‌ సిరిపురం స్వప్న ఆహ్వానం మేరకు అల్పాహారం ఆరగించేందుకు బూర్గంపహాడ్‌ వచ్చారు. ఈ సందర్భంగా ఎంపీని పినపాక నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వార్డు మెంబర్లు తదితరులు కలిశారు. అల్పాహారం అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం చిన్నచూపు చూస్తుందన్నారు. తెలంగాణ రాష్ర్టానికి సరిపడా నిధులు లేవని, కేంద్రం రూ.24వేల కోట్లు రాష్ర్టానికి ఆర్థిక సాయం చేయాలని నీతి ఆయోగ్‌ కమిటీ సూచించిందని తెలిపారు. కొంత మంది బీజేపీ నాయకులు రాష్ట్రంపై విమర్శలు చేయడమే తప్ప కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి మాట్లాడటం లేదని ఎంపీ ఆరోపించారు. అదేవిధంగా పాండురంగాపురం నుంచి సారపాక వరకు రైల్వేలైన్‌ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. భద్రాచలం వచ్చే భక్తుల సౌకర్యార్ధం రైల్వేలైన్‌ ఏర్పాటు చేయకతప్పదన్నారు. ఈ సారి జరిగే పార్లమెంట్‌ సమావేశాల్లో రైల్వేలైన్‌ ఏర్పాటుపై తాను ప్రస్తావించనున్నట్లు తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రవేశపెట్టిన సీతారామ ప్రాజెక్టు ఎంతో వేగవంతంగా పనులు జరుగుతున్నాయని, ఈ ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అవుతుందని ఎంపీ నామానాగేశ్వరరావు తెలిపారు. అనంతరం జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత దంపతులు, సర్పంచ్‌ సిరిపురం స్వప్న దంపతులు, ప్రజాప్రతినిధులు, జేఏసీ నాయకులు ఎంపీని సన్మారించారు. ఈ కార్యక్రమంలో అశ్వాపురం సొసైటీ చైర్మన్‌ తుళ్లూరి బ్ర హ్మయ్య, జడ్పీటీసీలు పోచం నర్సింహరావు, కామిరెడ్డి శ్రీలత, కొమరం కాంతారావు, ఎంపీపీలు రోశిరెడ్డి, గుమ్మడి గాంధీ, సుజాత, విజయకుమారి, ఎంపీటీసీలు జక్కం సర్వేశ్వరరావు, వల్లూరిపల్లి వంశీకృష్ణ, టీఆర్‌ఎస్‌ నాయకులు గోపిరెడ్డి రమణారెడ్డి, రామకొండారెడ్డి, క్రాంతికుమార్‌రెడ్డి, దుద్దుకూరి రాజా, నాని, విజయ్‌గాంధీ, ఎస్‌వీ ప్రసాద్‌, బిక్కసాని శ్రీనివాసరావు, బొల్లు సాంబశివరావు, భిక్షం, షబీర్‌పాషా, రామారావు, కోటి యాదవ్‌, రాజు యాదవ్‌ పాల్గొన్నారు.

40
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles