పెదవాగు ప్రాజెక్టు నుంచి నీటి విడుదల

Wed,August 21, 2019 01:00 AM

అశ్వారావుపేట రూరల్‌, ఆగస్టు 20 : మండలంలోని గుమ్మడవల్లి సమీపంలోని పెదవాగు ప్రాజెక్టు ఒక గేటు ఎత్తి 2820 క్యూసెక్కుల నీరు విడుదల చేసినట్టు నీటిపారుదల శాఖ ఏఈ కిషోర్‌వర్మ మంగళవారం తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తి సామార్థ్యం 6 మీటర్లు. 3వ గేటును 1.0 మీటర్లు మేరకు ఎత్తి దిగువ ప్రాంతానికి నీరు విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. ముందుగా ప్రాజెక్టు దిగువ ప్రాంతాల రైతులను అప్రమత్తం చేసేందుకు సైరన్‌ మోగించి, కొంత సమయం కేటాయించిన అనంతరం నీరు విడుదల చేశామన్నారు. ప్రస్తుతం 20.50 అడుగుల నీరు నిల్వ ఉందని ఏఈ తెలిపారు. విడుదల చేసిన నీరు రుద్రంకోట వద్ద గోదావరిలో కలుస్తుంది. 16వేల ఎకరాల నీరు అందించేందుకు ఈ ప్రాజెక్టును రూపొందించారు. ప్రస్తుతం 8వేల ఎకరాలకు పైగా సాగునీరు అందిస్తుండగా, ఆంధ్రప్రదేశ్‌లోని కుకునూరు, వేలేరుపాడు మండలాల్లోని కాల్వల చివరి భూములకు నీరు అందని పరిస్థితి. ప్రాజెక్టు ఆయకట్టులోని రైతులు ముమ్మరంగా వరినాట్లు వేస్తున్నారు. మండలంలోని ఉట్లపల్లి, మల్లాయిగూడెం, దబ్బతోగు, వినాయకపురంకాలనీ గ్రామాల్లోనే కుండపోతగా వర్షం కురిసింది. మిగిలిన గ్రామాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. దీంతో పెదవాగులోకి వరదనీరు చేరటంతో ప్రాజెక్టు గేటు ఎత్తి నీటిని విడుదల చేశారు.

33
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles