తాలిపేరు ప్రాజెక్టులో తగ్గిన వరద

Wed,August 21, 2019 01:00 AM

చర్ల రూరల్‌ : తాలిపేరు ప్రాజెక్టులో వరద క్రమేపీ తగ్గుతోంది. దీంతో పడిపోయిన ఇన్‌ఫ్లోని బట్టి ఎత్తిన గేట్లు దించుతున్నారు. మంగళవారం 2 గేట్లు మాత్రమే 5 అడుగులు ఎత్తి 6,424 క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. సోమవారం 17 వేల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా 6 గేట్లు ఎత్తి 17,300 క్యూసెక్కులు విడుదల చేసిన అధికారులు మంగళవారం ఉదయంకల్లా ఇన్‌ఫ్లో 6800 క్యూసెక్కులకు పడిపోవడంతో 4 గేట్లు దించి 2 గేట్లు మాత్రమే ఎత్తి ఉంచారు. వర్షాలు లేకపోవడంతో తాలిపేరులోకి వచ్చే వరద తగ్గుతోంది. వరదనీటిని అంచనా వేస్తూ 73.39 మీటర్ల నీటిని ప్రాజెక్టు రిజర్వాయర్‌లో నిల్వచేసి అదనపు నీటిని వదిలేస్తున్నారు. తాలిపేరు ప్రాజెక్టు కుడి, ఎడమకాలువలకి కలిపి 280 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. తాలిపేరు ప్రాజెక్టు వద్ద మంగళవారం ఉదయం 40 మిమీ వర్షపాతం నమోదు అయినట్లు ప్రాజెక్టు ఇన్‌చార్జ్‌ వెంకటేశ్వరరావు తెలిపారు.

33
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles