బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు

Wed,August 21, 2019 12:59 AM

-ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ పులిరాజు
కొత్తగూడెం ఎడ్యుకేషన్‌, ఆగష్టు 20 : ఎస్సీ రుణాలు పొందేందుకు గతంలో బ్యాంకర్ల అంగీకార పత్రం కోసం లబ్ధిదారులు బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చేదని, ప్రస్తుతం బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ ఎం.పులిరాజు అన్నారు. మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఈసారి నైపుణ్య కేటగిరిలో ఈడీఎస్సీ కార్పొరేషన్‌, లబ్ధిదారులను ఎంపిక చేసి జోడు ఖాతా నంబర్లు (సబ్సిడీ లోన్‌ అకౌంట్‌ నంబర్లు) కోసం నేరుగా ఆన్‌లైన్‌ ద్వారా బ్యాంకర్లు లాగిన్‌ ఐడీలోకి లబ్ధిదారుల సమాచారం పంపిస్తామన్నారు. నైపుణ్య, నైపుణ్యేతర విభాగాల కింద వేరువేరుగా లబ్ధిదారుల ఎంపిక జరగడం ఇదే మొదటిసారి అని అన్నారు. ఎస్సీ కార్పొరేషన్‌ ప్రణాళిక 2018-19 కింద దరఖాస్తుదారులు ధ్రువీకరణ పత్రాలు అందించడానికి గడువు ఈ నెల 23వ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోపు ఉందన్నారు. అభ్యర్థులు ఆదాయ ధ్రువీకరణ పత్రం గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతంలో రూ.2 లక్షలు మించకుండా ఉండాలని, కుల, ఆధార్‌, రేషన్‌, శిక్షణ అనుభవం ధ్రువీకరణ పత్రాలు అందజేయాలన్నారు. ధ్రువీకరణ పత్రాలు అందజేసిన అభ్యర్థులకు ఇంటర్యూ తేదీని ఫోన్‌ మెసేజ్‌ ద్వారా తెలియజేసి ఈ నెల 29వ తేదీ లోపు ఇంటర్యూలు పూర్తి చేస్తామని చెప్పారు. గతంలో ఎంపికలకు 856 మంది హాజరయ్యారని, అర్హతల ప్రకారం ధ్రువీకరణ పత్రాలతో 84 మంది అర్హత పొందారన్నారు. యూనిట్ల స్థిరీకరణ నియమ నిబంధనల ప్రకారం ఖచ్చితంగా చేయాలని అన్నారు.

42
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles