ఇసుక తరలిస్తున్న జేసీబీ, రెండు లారీల పట్టివేత.

Sun,August 18, 2019 02:44 AM

మణుగూరురూరల్ : అక్రమంగా ఇసుక తరలిస్తున్న జేసీబీ, రెండు లారీలను మణుగూరు తహసీల్దార్ మంగీలాల్ శనివారం పట్టుకున్నారు. వివరాలు ఇలా..మణుగూరు మండలం రామానుజవరం పంచాయతీలో ఎక్కడ బడితే అక్కడ కొందమంది జేసీబీ సహాయంతో ఎలాంటి అనుమతులు లేకుండా ప్రతి రోజు పగలు, రాత్రి అనే తేడా లేకుండా లారీల ద్వారా ఇసుకను తరలిస్తున్నారు. తమ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. ఎవరైనా వారికి అడ్డుచెబితే బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారు. దీంతో విషయం తెలుసుకున్న తహసీల్దార్ మంగీలాల్ శనివారం రామానుజవరం గ్రామంలో అక్రమంగా ఇసుక తోడుతున్న ఒక జేసీబీ, రెండు లారీలను అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుమతులు లేకుండా ఇసుక తోలకాలు జరిపిన, అక్రమంగా తీసుకువచ్చి ఎక్కడపడితే అక్కడ స్టాక్‌పాయింట్లు ఏర్పాటు చేసినా చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. ఇష్ట రాజ్యంగా తవ్వకాలు జరిపితే జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.

43
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles