హైదరాబాద్‌లో తప్పిపోయిన వ్యక్తి కొత్తగూడెంలో గుర్తింపు

Sun,August 18, 2019 02:44 AM

-కుటుంబ సభ్యులకు అప్పగించిన టూ టౌన్ పోలీసులు
కొత్తగూడెం క్రైం : హైదరాబాద్‌లో తప్పిపోయిన వ్యక్తిని కొత్తగూడెంలో గుర్తించినట్లు టూ టౌన్ పోలీసులు అతని కుటుంబీకులకు సమాచారం తెలిపి శనివారం వారి కి అప్పగించారు. వివరాలు.. హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌నకు చెందిన అనిల్ కొంత కాలం క్రితం తప్పిపోయాడు. ఈ విషయమై అతడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో అదృశ్యం కేసు నమోదైంది. అయితే ఓ వ్యక్తి రామవరంలో అనుమానస్పదంగా తిరుగుతుండగా అతన్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల విచారణలో సదరు వ్యక్తి ముషీరాబాద్ పీఎస్ పరిధిలో అదృశ్యమైన అనిల్‌గా గుర్తించి అతని కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. శనివారం కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న కుటుంబ సభ్యులకు ఇన్స్‌పెక్టర్ తుమ్మ గోపి అధ్వర్యంలో సిబ్బంది అనిల్‌ను అప్పగించారు.

33
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles