కిన్నెరసానికి నాలుగు గేట్లు ఎత్తివేత

Sun,August 18, 2019 02:42 AM

పాల్వంచ రూరల్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పరిధిలోని కిన్నెరసానిలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతుండటంతో శనివారం ప్రాజెక్టు అధికారులు నాలుగు గేట్టు ఎత్తి 16వేల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 407 అడుగులు కాగా శనివారం సాయంత్రం నీటి మట్టం 405.9 అడుగులకు చేరుకుంది. రిజర్వాయర్ నిండటం, ఇన్‌ఫ్లో ఆరువేల క్యూసెక్కులు ఉండటంతో రిజర్వాయర్‌లోని 16 క్యూసెక్కుల నీటిని నాలుగు గేట్ల ద్వార దిగువకు విడుదల చేసారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకుప్రజలకు మందస్తు హెచ్చరికలు జారీ చేశారు.

35
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles