కేటీపీఎస్ 6వ దశలో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి

Sun,August 18, 2019 02:42 AM

పాల్వంచ: పాల్వంచలోని కేటీపీఎస్ 6వ దశ 11వ యూనిట్‌లో శనివారం తిరిగి విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. బాయిలర్ ట్యూబ్స్ లీకవడంతో 500 మెగావాట్ల ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దీంతో రాష్ట్ర గ్రిడ్‌కు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 20 రోజుల పాటు ఇంజినీర్లు ఆరవ దశలో వార్షిక మరమ్మతులు చేపట్టారు. శుక్రవారం తిరిగి ఉత్పత్తిని ప్రారంభించిన కొన్ని గంటల్లోనే బాయిలర్ ట్యూబ్స్ లీక్ అవడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేటీపీఎస్ ఇంజినీర్లు అత్యవసరంగా యూనిట్‌ను నిలిపివేశారు. కేటీపీఎస్ సీఈ ఆనందం సూచనల మేరకు ఇంజినీర్లు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు చేపడుతున్నారు. బాయిలర్‌లో ఉష్ణోగ్రతలు పూర్తిస్థాయిలో తగ్గిన తర్వాత పాడైన భాగాలను తొలగించి కొత్తవాటిని అమర్చనున్నారు. ఆదివారం అర్ధరాత్రిలోపు తిరిగి ఉత్పత్తి చేపట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నా

29
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles