అపురూప వేడుక..రాఖీ పండుగ..!

Fri,August 16, 2019 04:21 AM

-సందడిగా మారిన పల్లెలు, పట్నాలు
-ఉత్సాహంగా రాఖీ కొనుగోళ్లు
కొత్తగూడెం టౌన్ :సోదర సోదరీమణుల ప్రేమానుబంధానికి చిహ్నం రాఖీ పండుగ.. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల ఆత్మీయ బంధానికి అపురూప వేదిక..! నీకు నేను రక్ష.. నాకు నువ్వు రక్ష.. అంటూ ఆడబిడ్డలు వారి సోదరులకు రాఖీ కట్టారు.. రాఖీలు, మిఠాయిల కొనుగోళ్లతో గురువారం జిల్లా అంతటా సందడి కనిపించింది.. శ్రావణ పౌర్ణమి ప్రతీ ఇంటా వెలుగులు పంచింది..!- నమస్తే నెట్‌వర్క్

ఆనాదిగా వస్తున్న సంప్రదాయానికి ప్రతీకగా నిలిచిన రక్షా బంధన్ వేడుకలు గురువారం కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఘనంగా జరుపుకున్నారు. అంగన్‌వాడీ సెంటర్లలో చిన్నారులకు బేటీ బచావో బేటీ పఢావో కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు రక్షాబంధన్ కట్టి పండుగను జరిపారు. మున్సిపాలిటీ పరిధిలో కూలీలైన్, మేదరబస్తీ, రామవరం, సుజాతనగర్, శింగభూపాలెం, చుంచుపల్లి సెక్టార్ల పరిధిలో వేడుకులు నిర్వహించారు. ప్రతీ ఇంటా ఆనందంతో ఈ పండుగను జరిపారు. ఉదయం నుంచే చెల్లెల్లు, అక్కలు అన్నలు, తమ్ముళ్లు ఇంటికి చేరుకుని హారతులు ఇచ్చి, స్వీట్లు తినిపించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం, అశ్వారావుపేట, ఇల్లెందు, పినపాక నియోజక వర్గాల్లో ఈ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.

కళ కళలాడిన దుకాణాలు
రాఖీ పండుగ ఆదివారం రావడం అందరికీ కలిసొచ్చింది. ప్రతీ ఒక్కరూ ఇంటి వద్ద సరదాగా రాఖీ పండుగను సంతోషంగా జరిపారు. కొత్త దుస్తులు వేసుకుని అన్నా చెల్లెల్లు సరదాగా గడిపారు. స్వీటు షాపుల వద్ద కిటకిట లాడారు.

37
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles