భద్రాద్రి వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి

Fri,August 16, 2019 04:16 AM

భద్రాచలం, నమస్తే తెలంగాణ: భద్రాచలం ఏజెన్సీలో గోదావరి మళ్లీ పెరుగుతోంది. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వచ్చిన గోదావరి గురువారం ఉదయం నుంచి పెరుగుతోంది. భద్రాద్రి వద్ద మధ్యాహ్నం 1గంటకు 34.3 అడుగులు ఉన్న గోదావరి 2గంటలకు 35.1, 3గంటలకు 36.1, 5గంటలకు 36.7, 6గంటలకు 38 అడుగులకు చేరుకుంది. భద్రాచలం ఏజెన్సీకి ఎగువ భాగంలో ఉన్న ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలో భారీగా వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో వరద నీరు భద్రాచలం ఏజెన్సీకి చేరుకుంటోంది. దీంతో గోదావరి వరద ఉధృతి ఒక్కసారిగా పెరిగింది.

34
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles