తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామి

Fri,August 16, 2019 04:16 AMఖమ్మం, నమస్తే తెలంగాణ : సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న ప్రగతిశీల విధానాలు, ఆర్థిక క్రమ శిక్షణ కారణంగానే తెలంగాణ రాష్ట్రం అతి కొద్ది సమయంలోనే దేశంలోనే అగ్రగామిగ నిలిచిందని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య ,పాడిపరిశ్రమాభివృద్ధి , సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు.కేసీఆర్ పోరాట పటిమతో తెలంగాణ రాష్ట్రం ఏవిధంగానైతే సాధించారో ఆయన ముందు చూపుకారణంగా తెలంగాణ రా ష్ట్రం దేశంలోని ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తుందని, దీనికి ప్రతి తెలంగాణ బిడ్డ గర్వించాలని మంత్రి అన్నారు. 73వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భం గా గురువారం ఖమ్మంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జాతీయ జెండాను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్, పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్‌తో కలిసి పోలీసు వం దనం స్వీకరించారు. అనంతరం ఖమ్మంజిల్లా పురోగతిలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించారు. సీఎం కేసీఆర్ దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షే మ, అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్రంలో అమలు చేస్తూ దేశంలోని ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. కొత్త రాష్ట్రమైనప్పటికీ మిగిలిన రాష్ర్టాలన్ని తెలంగాణ వైపు చూసేలా పాలన కొనసాగిస్తున్నారన్నారు.రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి వేగంగా జరుగుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ నిరూపించారన్నారు.

ఆదర్శంగా రైతుబీమా పథకం.. రైతుబంధు, రైతుబీమా పథకాలు ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఈ పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు రూ. 5 లక్షల చొప్పున 700 మంది రైతులకు బీమా సొమ్ము అందించడం జరిగిందన్నారు..
రైతుబంధు పథకం.. రైతుబంధు ద్వారా మన జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్‌లో మూడవ విడతగా రూ. 182.99 కోట్లు, 1 లక్ష 63 వేల 409 మంది రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. జిల్లాలో 2 లక్షల 98 వేల 104 పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు.
మిషన్ భగీరథ.. ఆరోగ్యవంతమైన సమాజం కోసం ఇంటింటికి సురక్షితమైన తాగునీటిని అం దించేందుకు జిల్లాలో రూ. 338.62 కోట్లతో చేపట్టిన, మిషన్ భగీరథ పనుల్లో భాగంగా జిల్లాలోని 20 మండలాల్లో 520 ఓహెచ్‌ఎస్‌ఆర్ ట్యాంకులు నిర్మించుకోవడం జరిగిందన్నారు. 2165 కిలోమీటర్ల పైపులైను పనులు పూర్తి చే యడం జరిగిందని, 2 లక్షల 73 వేల 255 నల్లా కనెక్షన్లను ఇవ్వడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు.
ఈ వేడుకల్లో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజ్, ఖమ్మం శాసనసభ్యులు పువ్వాడ అజయ్‌కుమార్, శాసనమండలి సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ, కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్, నగర మేయర్ డాక్టర్ జీ పాపాలాల్, సీపీ తప్సీర్ ఇక్బాల్, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.

23
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles