సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం నంబర్‌వన్

Fri,August 16, 2019 04:15 AM

-జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: అభివృద్ధి పథకాల అమలులో భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా ముందంజలో ఉందని జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య అన్నారు. గురువారం జిల్లా పరిషత్ కార్యాలయంలో 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. తొలిసారిగా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన జడ్పీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందుతున్నాయని, కొత్తగా ప్రవేశపెట్టిన ఆసరా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, వితంతు, వృద్ధాప్య పింఛన్లు లబ్దిదారులకు సకాలంలో అందించడం జరుగుతోందని, పెంచిన పింఛన్లను నేరుగా వారి ఖాతాల్లోనే జమ అవుతున్నాయన్నారు. యావత్ దేశంలోనే ఎక్కడా అమలు కాని పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు జరగడం రాష్ర్టానికే గర్వ కారణమన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావు, జడ్పీ సీఈవో మధుసూదన్‌రాజు, అకౌంట్స్ ఆఫీసర్ పురుషోత్తం, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

29
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles