బొగ్గు ఉత్పత్తి రంగంలో రారాజు సింగరేణి

Fri,August 16, 2019 04:15 AM

కొత్తగూడెం సింగరేణి: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్ దిశ నిర్ధేశంతో సింగరేణి సంస్థకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని, భవిష్యత్‌లో విద్యుత్ అవసరాలకు అనుగుణంగా రక్షణకు ప్రాధాన్యతనిస్తూ బొగ్గుత్పత్తి చేస్తామని సింగరేణి డైరెక్టర్(ఈ అండ్ ఎం) సలాకుల శంకర్ అన్నారు. గురువారం కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో జరిగిన 73వ స్వాతంత్య్రవ దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి, ఎస్ అండ్ పీసీ నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సింగరేణి కుటుంబాలను, కార్మికులను, అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు 2013-14ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే గడిచిన ఐదేళ్ళ కాలంలో బొగ్గుత్పత్తిలో 27.5శాతం, బొగ్గు రవాణాలో 41.3శాతం, ఓవర్‌బర్డెన్‌లో 40శాతం, టర్నోవర్‌లో 116శాతం, లాభాల్లో 322శాతం వృద్ధిని సాధించామన్నారు

సింగరేణి ఉత్తమ ఉద్యోగులకు సన్మానం
సింగరేణిలో విశిష్ట సేవలను అందించిన ఉద్యోగులను గుర్తించి ఉత్తమ ఉద్యోగులుగా అవార్డులను అందజేశారు. పాడి మల్లారెడ్డి (భూపాలపల్లి), సీహెచ్.వీ.సత్యనారాయణ (ఆర్‌జీ-2), టీఆర్.సుందర్‌రాజు (ఆర్‌జీ-), సమిళ్ళ రాజేశం(ఆర్‌జీ-1), సయ్యద్ రజీయుద్దీన్(బెల్లంపల్లి), ఐలవేని రాజయ్య (మందమర్రి), ఎంబడి భీమయ్య (శ్రీరాంపూర్), ఎస్.వెంకటసుబ్బయ్య(మణుగూరు), కొత్త జనార్ధన్‌రెడ్డి(ఇల్లెందు), కొంటు ఈశ్వరయ్య (కొత్తగూడెం), తుమ్మ మారుతీప్రసాద్(ఎస్‌టీపీపీ)లను డైరెక్టర్లు ఎస్.శంకర్, చంద్రశేఖర్, బలరాం, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి, సీఎంఓఏఐ కార్పోరేట్ అధ్యక్షుడు ఎంఆర్‌జీకే.మూర్తిలు శాలువాలు, పూలమాలలు వేసి మెమెంటో, బహుమతులను అందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో జీఎం పర్సనల్(ఆర్‌సీ ఐఆర్ అండ్ పీఎం) ఏ.ఆనందరావు, జీఎం(వెల్ఫేర్ అండ్ సీఎస్‌ఆర్) కె.బసవయ్య, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు సోమిరెడ్డి, సీఎండీ చర్చల ప్రతినిధి కాపు కృష్ణ, ఎస్‌టీపీపీ సెక్యూరిటీ ఆఫీసర్ జాకీర్ హుస్సేన్, ఇతర జీఎంలు, ఏజీఎంలు, డీజీఎంలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పాఠశాలల విద్యార్ధుల నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

సింగరేణి హెడ్డాఫీస్‌లో బంగారుతెలంగాణకు ప్రతీ ఒక్కరూ పునరంకితం కావాలని, దేశం చూపు సింగరేణి వైపు నిలిచేలా పరిశ్రమిద్దామని సింగరేణి డైరెక్టర్ ఫైనాన్స్ ఎన్.బలరాం పిలుపునిచ్చారు. కొత్తగూడెం హెడ్డాఫీస్‌లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రతిఒక్కరూ దేశసేవలో ముందుండాలన్నారు.

34
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles