జెండా వందనం

Wed,August 14, 2019 11:56 PM

-100 అడుగుల ఎత్తులో మువ్వన్నెల జెండా..
-నేడు ఆవిష్కరించనున్న మంత్రి తలసాని
-ఏర్పాట్లను పరిశీలించిన ఖమ్మం కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్

ఖమ్మం నమస్తేతెలంగాణ: ఖమ్మం నగరానికి మణిహారంగా ఉన్న లకారం ట్యాంక్‌బండ్‌పై గురువారం మరో అద్బుతం ఆవిష్కృతం కాబోతుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఖమ్మం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో లకారం ట్యాంక్ బండ్‌పై 100 అడుగుల ఎత్తున ఏర్పాటు చేసిన జాతీయ జెండాను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరిస్తారు. ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ ప్రత్యేక చొరవతో మిషన్‌కాకతీయ ద్వారా సుమారు 14 కోట్ల రూపాయలతో లకారం చెరువు ఆధునీకరణ పనులు చేపట్టారు. ఆ తరువాత మరో 5 కోట్లతో లకారం ఆధునీకరణ పనులు చేపట్టారు. అంతేకాకుండా లకారం చెరువును సాగర్ నీళ్ళతో ప్రతి ఏటా నింపుతున్నారు. ఇది ప్రస్తుతం ఖమ్మం నగర ప్రజలకు ఒక ఐకాన్ గా మారింది.

నగర ప్రజలతో పాటు వివిధ పనుల నిమి త్తం ఖమ్మంకు వచ్చే ప్రజలకు లకారం ట్యాంక్‌బండ్ అం దాలు ఆనందాన్ని ఇవ్వడంతో పాటు ఆహ్లాదాన్ని పంచుతుంది. లకారం చెరువులో బోటింగ్ కూడా ఏర్పాటు చేశారు. వారాంతపు సెలవుల్లో పిల్లలు, పెద్దలు రోజు బోటింగ్ చేస్తూ ఆనందంగా గడుపుతున్నారు. చిన్నారులకు సైక్లింగ్, బ్యాటరీ కార్లు కూడా అందుబాటులో ఉంచడంతో నగర ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఖమ్మం నగరానికి ఐకాన్‌గా ఉన్న లకారం గురువారం మరో నూతన గుర్తింపును సొంతం చేసుకుంటోంది. 100 అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఏర్పాటు చేయడం విశేషం.

51
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles