డోలీ మోసిన డాక్టర్...!

Wed,August 14, 2019 11:51 PM

పాల్వంచ రూరల్: వైద్యడు భగవంతుడితో సమానం అన్న నానుడిని చేతల్లో నిజం చేసి చూపారు డాక్టర్ రాంబాబు. అపుడే పుట్టిన కవలల్లో రెండో బిడ్డకు, బాలింతకు సకాలంలో చికిత్స అందించి కాపాడారు. మండలంలోని ఉల్వనూరు పీహెచ్‌సీ డాక్టర్ రాంబాబు, బుధవారం మండలంలోని శివారు గ్రామమైన రాళ్ళచెలకలో వైద్య శిబిరం నిర్వహించేందకు స్వచ్ఛంద సంస్థకు చెందిన డాక్టర్ నరేందర్‌తో కలిసి వెళ్లారు. అదే గ్రామంలో, అప్పటికి రెండు గంటల క్రితమే కవలలకు మడివి సుక్క జన్మనిచ్చిందని, ఆమె అనారోగ్యంతో ఉందని వారికి సమాచారం అందింది. వెంటనే వారు ఆమె వద్దకు వెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించారు.

కవలలను పరీక్షించారు. అందులో, రెండవ బాబు.. ఉమ్మ నీరు తాగి అస్వస్థుడయ్యాడు. ఆ బాలింతకు ఇన్ఫెక్షన్ సోకే సూచనలు కనిపించాయి. ఆమెకు ప్రాథమిక చికిత్స చేశారు. అంబులెన్స్‌కు సమాచారమిచ్చి, ఆమెను కుటుంబీకులు.. బంధువుల సాయంతో దాదాపు ఆరు కిలోమీటర్ వరకు డోలిలో ఉల్వనూరు ప్రధాన రహదారి వరకు మోసుకొచ్చారు. అప్పటికే అక్కడ అంబులెన్స్ సిద్ధ్దంగా ఉంది. అందులో ఆ బాలింతను, కవలలను భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆ ముగ్గురినీ దేవుడిలా వచ్చి కాపాడారు అంటూ, డాక్టర్ రాంబాబుకు, వైద్య సిబ్బందికి ఆ గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు, ప్రేమాభిమానాలతో మనసారా ఆశీర్వదించారు.

36
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles