కేసీఎస్ రావుకు జీవితసాఫల్య పురస్కారం

Wed,August 14, 2019 11:50 PM

కొత్తగూడెం టౌన్: కొత్తగూడెం పట్టణానికి చెందిన సీనియర్ ఫొటోగ్రాఫర్ కేసీఎస్‌రావు జీవితసాఫల్య పురస్కారాన్ని అందుకోనున్నారు. అంతర్జాతీయ ఛాయాచిత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈనెల 16న హైదరాబాద్‌లో శ్రీత్యాగరాయ గాన సభలో ఆయన ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. ప్రముఖ ఛాయా గ్రాహకులు దివంగత బీమన హరిబాబు జ్ఞాపకార్ధం పురస్కార ప్రధానోత్సవం జరగనున్నట్లు కుసుమ చంద్రశేఖర్‌రావు (కేసీఎస్‌రావు) తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుంచి తనను ఎంపిక చేసినట్లు ఆయన వెల్లడించారు. 60 ఏళ్ల వయస్సు పైబడిన వారికి ఈ అవార్డును అందజేయనున్నారు. ముఖ్య అతిథిగా మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య, చింతలపాటి శూలపాణి, సినీ నటులు గిరిబాబు, గీతాంజలి చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.

47
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles