బాలికపై లైంగిక దాడి కేసు నమోదు

Wed,August 14, 2019 11:49 PM

దమ్మపేట: బాలికపై హత్యాచారం చేసి గర్భిణీని చేసిన సంఘటన మండలంలోని వెంకటాద్రిగూడెంలో చోటుచేసుకుంది. కుటుంబసభ్యుల పిర్యాదు మేరకు బుధవారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఎస్సై తిరుపతి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని వెంకటాద్రిగూడెంకు చెందిన ఓ బాలికను ప్రేమ పేరుతో మోసగించి గర్భవతిని చేశాడు. అదే గ్రామానికి చెందిన రాగం వంశీ, గత రెండు సంవత్సరాలుగా మైనర్ బాలికను ప్రేమ పేరుతో వంచించి గర్భవతిని చేశాడు.

దీంతో బాలిక పెళ్ళి చేసుకోవాలని అడగగా మాటలు దాటేస్తు కనిపించకుండా తిరుగుతున్నాడు. బాలలిక 6 నెలలు గర్భవతి కావటంతో విషయంను కుటుంభ సభ్యలకు తెలియజేసింది. దీంతో కుటుంభ సభ్యులు రాగం వంశీ కుటుంభ సభ్యులతో ప్రేమ వ్యవహారంపై మాట్లాడినా వారి కుటుంభం నుండి ఎటువంటి స్పందన రాకపోవటంతో దమ్మపేట పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశారు. బాలిక కుటుంభ సభ్యులు పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపతి తెలిపారు.

55
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles