పెద్దవాగుప్రాజెక్టు నుంచి నీటి విడుదల

Wed,August 14, 2019 11:48 PM

అశ్వారావుపేట రూరల్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు మండలంలోని చెరువులు, ప్రాజెక్టులలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. పెద్దవాగు ప్రాజెక్టులోకి వరదనీరు భారీగా వచ్చి చేరుతుండటంతో బుధవారం ఒక్క గేటు ఎత్తి వరదనీటిని దిగువన గోదావరిలోకి వదిలారు. 3వ నెంబర్ గేటును 1.0 మీటర్లు ఎత్తి 2820 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలినట్లు ప్రాజెక్టు పర్యవేక్షకుడు కిషోర్ తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నందున ప్రాజెక్టులోకి వరదనీరు అధికంగా వచ్చి చేరే అవకాశాలు ఉన్నందున దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఎమ్మెల్సీ బాలసానికి రక్షాబంధన్ శుభాకాంక్షలు
భద్రాచలం, నమస్తే తెలంగాణ: ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణకు టీఆర్‌ఎస్ మహిళా నాయకురాళ్లు బుధవారం ముందస్తుగా రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. చర్ల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బోదెబోయిన బుచ్చయ్యకు కూడా రాఖీలు కట్టారు. ఈసందర్భంగా ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ వారికి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల మహిళా అధ్యక్షురాలు ఎండీ ముంతాజ్, ఎంపీపీ శాంతమ్మ, సీతామహాలక్ష్మి, ఎంపీటీసీలు మానె కమల, జ్యోతి, భద్రాచలం మాజీ సర్పంచ్ భూక్యా శ్వేత, నర్సమ్మ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు రాష్ట్ర హోంశాఖా మంత్రి మహమూద్ ఆలీ బుధవారం రాత్రి 9.15 గంటలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. జిల్లా కేంద్రం సమీపంలోని విద్యానగర్ కాలనీలో ఉన్న ఆంజనేయస్వామి విగ్రహం వద్ద జిల్లా టీఆర్‌ఎస్ నాయకులు మంత్రి మహమూద్ ఆలీకి పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు వనమా రాఘవేందర్‌రావు, జడ్పీ వైస్‌చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావులు ఉన్నారు. అక్కడి నుంచి బయల్దేరిన మంత్రి సింగరేణి సంస్థకు చెందిన ఇల్లెందు అతిథి గృహానికి చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న హోంమంత్రి మహమూద్ ఆలీకి జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, కలెక్టర్ రజత్‌కుమార్‌శైనీ, ఎస్పీ సునీల్‌దత్, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్‌లు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. గురువారం ఉదయం ఇల్లెందు అతిథిగృహం నుంచి నేరుగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిగే ప్రగతి మైదాన్‌కు చేరుకొని వేడుకల్లో పాల్గొంటారు.

36
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles