గ్రామీణ వికాస్ బ్యాంక్‌లో చోరీకి యత్నం

Tue,August 13, 2019 12:25 AM

దమ్మపేట, ఆగస్టు 12 : మండల కేంద్రం దమ్మపేటలోని గ్రామీణ వికాస్ బ్యాంక్‌లో చోరీకి ప్రయత్నించిన సంఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. దమ్మపేట ఎస్‌ఐ శ్రీపతి తిరుపతి తెలిపిన వివారాల ప్రకారం... దమ్మపేట ప్రధాన రహదారి పక్కన ఉన్న గ్రామీణ వికాస్ బ్యాంక్ వెనుక భాగంలో కిటికీ ఊసలను కట్ చేసి బ్యాంక్‌లోపలకి ప్రవేశించారు. దుండగులు బ్యాంక్‌లో ఉన్న సీసీ కెమెరాలను, హార్డ్ డిస్క్ సిస్టంతో సహాతీసుకు వెళ్లారని తెలిపారు. రెండు రోజులుగా సెలవు దినములు కావటంతో బ్యాంక్ సిబ్బంది గమనించలేదు. బ్యాంక్ మేనేజర్ మారం శ్రీకాంత్ దమ్మపేట పోలీసులకు సమాచారం ఇవ్వటంతో అశ్వారావుపేట సీఐ అబ్బయ్య ఆధ్వర్యంలో జాగిలాలను రప్పించి విచారణ చేపట్టారు. పాల్వంచ డీఎస్‌పీ మధుసూదనరావు బ్యాంక్‌ను పరిశీలించి స్థానిక సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బ్యాంక్ మేనేజర్ మారం శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

40
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles