పాలేరుకు చేరిన సాగర్ జలాలు

Tue,August 13, 2019 12:23 AM

కూసుమంచి, ఆగస్టు 12: సాగర్ నుంచి ఎడమ కాలువకు ఆదివారం విడుదల చేసిన నీరు సోమవారం అర్ధరాత్రి 12.00 - 1.00 గంటల మధ్య పాలేరు రిజర్వాయర్‌కు చేరుకున్నాయి. అయితే దాదాపు ఏడు నెలల తర్వాత కాలువకు నీటిని విడుదల చేయడంతో పాలేరుకు కేటాయించిన మూడు వేల క్యూసెక్కుల నీటిలో సగం వరకే రిజర్వాయర్‌కు చేరవచ్చని ఎన్నెస్పీ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌కు 8 లక్షల క్యూసెక్కులు నీరు చేరుతుండడంతో సుమారు 2 లక్షల క్యూసెక్కులు కృష్ణానదిలోకి వదిలిన విషయం తెలిసిందే. అలాగే సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల పెంచినందున రెండురోజుల్లో పాలేరు రిజర్వాయర్ నిండుతుంది. పాలేరులో ప్రస్తుతం 13.6 అడుగుల నీరు ఉంది. కాగా పాలేరు నుంచి రెండో జోన్‌కు ప్రస్తుతం నీటిని విడుదల చేసే అవకాశం లేదని, పాలేరులో కనీసం 15 అడుగల మేర నీరు ఉంటేనే ఇది సాధ్యమవుతుందని ఎన్నెస్పీ అధికారి ఒకరు తెలిపారు.

ఈనెల 15న రెండో జోన్‌కు నీరు విడుదల చేసే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఈమేరకు ఎన్నెస్పీ అధికారులు సోమవారం రెండోజోన్ పరిధిలోని కాలువను పరిశీలించారు. సాగర్ జలాశయానికి రికార్డు స్థాయిలో నీరుచేరడంతో జిల్లాలో సాగర్ రెండు, మూడు జోన్ల పరిధిలోని సుమారు 3 లక్షల ఎకరాల ఆయకట్టుకు రెండు పంటలకు నీరు అందుతుంది. మరోవైపు భక్తరామదాసు ఎత్తిపోతల పథకం నుంచి తిరుమలాయపాలెం, కూసుమంచి, ఖమ్మం రూరల్, మరిపెడ మండలాల పరిధిలోని 35 చెరువులు నింపడానికి కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

33
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles