జమలాపురంలో ముగిసిన పవిత్రోత్సవాలు..

Tue,August 13, 2019 12:23 AM

ఎర్రుపాలెం : తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాలు సోమవారం ముగిశాయి. ఈ సందర్భంగా పవిత్రధారణ యుక్త హవనం, అవివాహిత దేవతల మూలమంత్ర హో మం, బలిహరణ, అనం తరం మహాపూర్ణాహుతి కార్యక్రమాలను అర్చకులు, వేదపండితులు నిర్వహించారు. సుదర్శనచక్ర పెరుమాళ్ల ఆధ్వర్యంలో మేళతాళాలు, వేదమంత్రతో విచ్చేసిన భక్తులందరి జయజయధర్వనముల మధ్య గోవింద నామ స్మరణలతో చక్రస్నానం నిర్వహించారు. స్వామివారితో పాటు భక్తులు మూడుసార్లు పుష్కరిణిలో ముగిని పుణ్యస్నానాలు ఆచరించారు.

వేదమంత్రాలతో గంగమ్మతల్లికి పసుపు, కుంకుమ, సారె ఇచ్చి మంగళహారతులు జరిపారు. అనంతరం శాంతికల్యాణం నిర్వహించారు. భక్తులకు దేవస్థానం తరపున శేషవస్ర్తాలు, ప్రసాదాలు, అన్నప్రసాద వితర

29
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles