పాలకవర్గ సమావేశాన్ని విజయవంతం చేయాలి

Tue,August 13, 2019 12:22 AM

భద్రాచలం, నమస్తే తెలంగాణ: భద్రాచలం ఐటీడీఏలో మంగళవారం జరిగే ఐటీడీఏ పాలకవర్గ సమావేశానికి వచ్చే ప్రజా ప్రతినిధులకు, జిల్లా అధికారులకు ఎటువంటి లోటుపాట్లు జరుగకుండా సంబంధితశాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రశాంతమైన వాతావరణంలో పాలకవర్గ సమావేశం విజయవంతం అవడానికి కృషి చేయాలని భద్రాచలం ఐటీడీఏ పీవో వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక ఐటీడీఏ సమావేశమందిరంలో అధికారులతో పాలకవర్గ సమావేశంలో చర్చించాల్సిన విషయాలపై పీవో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...విద్యా, వైద్యం, ఇంజినీరింగ్, జీసీసీ, ఇతరశాఖలకు సంబంధించిన నివేదికలు తప్పులు లేకుండా సమగ్ర సమాచారం అందుబాటులో ఉంచుకోవాలన్నారు.

ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఎటువంటి ఆటంకం కలుగకుండా పోలీస్‌శాఖ శాంతిభద్రతల విషయంలో శ్రద్ధ చూపాలని తెలిపారు. అనంతరం వీఐపీలకు సమకూర్చుతున్న వసతి సౌకర్యాలను పీవో పరిశీలించారు. ఐటీడీఏ వెనుకభాగంలో ఉన్న గంబూజియా చేపలు పెంచే కొలను, పాఠశాలకు సరఫరా అయ్యే డీఎల్ డెస్క్ వర్క్‌షాప్‌ను, కొత్తగా నిర్మించి ప్రారంభానికి సిద్ధంగా ఉన్న వైటీసీ భవనాన్ని పరిశీలించారు. ప్రోటోకాల్‌కి సంబంధించిన విషయాలను ఈఈటీడబ్ల్యూతో చర్చించి ప్రజా ప్రతినిధులు ప్రోటోకాల్‌కి భంగం కలుగకుండా ఏర్పాట్లు చేయాలని పీవో తెలిపారు. కార్యక్రమంలో ఏపీవో జనరల్ నాగోరావు, ఏవో భీమ్, ఈఈటీడబ్ల్యూ కోటిరెడ్డి, డీఎం జీసీసీ కుంజా వాణి, ఏపీవో పవర్ అనురాధ, ఏఈవో అగ్రికల్చర్ సుజాత, పీఎంఆర్‌సీ భావ్‌సింగ్, నాగిరెడ్డి, ఎస్‌వో సురేశ్‌బాబు, ఇతరశాఖల సిబ్బంది పాల్గొన్నారు.

33
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles