పంద్రాగస్టుకు ముస్తాబవుతున్న స్టేడియం

Tue,August 13, 2019 12:22 AM

కొత్తగూడెం సింగరేణి: ఈనెల 15వ తేదీ జరుగనున్న 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సింగరేణి కార్పొరేట్ పరిధిలోని కొత్తగూడెం ప్రకాశం స్టేడియం గ్రౌండ్ ముస్తాబవుతున్నది. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా సింగరేణి సంస్థ సీఅండ్‌ఎండి ఎన్.శ్రీధర్ హాజరుకానున్న నేపథ్యంలో ఏర్పాట్లను ఘనంగా నిర్వహిస్తున్నారు. వర్షం వచ్చినా కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకం కలుగకుండా భారీ షెడ్‌ను నిర్మించారు. సీఅండ్‌ఎండీ హాజరయ్యే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను సోమవారం డైరెక్టర్స్ ఆపరేషన్స్ అండ్‌పా ఎస్.చంద్రశేఖర్ పరిశీలించారు. ఏర్పాట్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపి పలు సూచనలు చేశారు. డైరెక్టర్ వెంట సింగరేణి అధికారులు జీఎం (పర్సనల్ వెల్ఫేర్ అండ్ సీఎస్‌ఆర్) కె.బసవయ్య, చీప్ ఆఫ్ సివిల్ సీహెచ్ రమేశ్‌బాబు, డీజీఎంలు సాల్మ న్, రాజీవ్‌కుమార్, రాజశేఖర్, పర్సనల్ మేనేజర్ దన్‌పాల్ శ్రీనివాస్, ఇంజినీర్లు రవికుమార్ సీనియర్ పీవో బేతిరాజు, కరుణాకర్‌రెడ్డి, స్పో ర్ట్స్ ఆఫీసర్ డి.సుందర్‌రా జు, ఎంసీ.పాస్‌నెట్, పీఏ వరప్రసాద్‌లున్నారు.

కవాతు కసరత్తు...
పంద్రాగస్టు పర్వదినాన్ని పురస్కరించుకుని పోలీస్‌శాఖ కవాతు కసరత్తులు చేస్తున్నది. ఏఆర్ డీఎస్పీ చాపర్తి కుమారసామి నేతృత్వంలో ఏఆర్ ఆర్‌ఐ(అడ్మిన్) సీహెచ్ ఎస్వీ కృష్ణ స్పెషల్ పార్టీ సిబ్బంది, ఏఆర్ సిబ్బంది, హోంగార్డులతో కవాతు కసరత్తు నిర్వహిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రగతి మైదాన్‌లో కవాతు ప్రదర్శన నిర్వహించనున్నారు. కవాతులో ఒక ఏఆర్ డీఎస్పీ, ఇద్దరు ఆర్‌ఎస్‌ఐలు, ఇద్దరు హెచ్‌సీ లు, 48మంది కానిస్టేబుళ్లు, ప్రదర్శనలో పాల్గొంటారు.

30
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles