పురుగుమందు విక్రయ డీలర్లకు శిక్షణ

Mon,August 12, 2019 12:41 AM

పాల్వంచ : ఎరువులు, పురుగుమందులు, విత్తనాలను విక్రయించే ఫెర్టిలైజర్స్ డీలర్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరరల్ ఎక్ష్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ శిక్షణ ఫెసిలిటేటర్ దామోదర్‌రెడ్డి తెలిపారు. పాల్వంచ పట్టణంలోని అనుబోస్ కాలేజిలో ఆదివారం జిల్లాలోని ఫెర్టిలైజర్స్ డీలర్ల శిక్షణకు సంభందించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. డీలర్లకు ఎరువులు, పురుగుమందులు, విత్తనాలపై సరైన అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం డీలర్లకు శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. (డిప్లోమో ఇన్ అగ్రికల్చర్ ఎక్ష్‌టెన్షన్ సర్వీసెస్ ఫర్ ఇన్ పుట్ డీలర్స్ ) అనే కోర్సును ఏర్పాటు చేసి బ్యాచీకి 40మందిని ఎంపిక చేసి ప్రతి బ్యాచ్‌కు ఒక సంవత్సరాం పాటు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ శిక్షణ అనంతరం వారికి పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి డిప్లోమో సర్టిఫికెట్‌ను అందజేయనున్నట్లు ఆయన వెల్లడించారు. సర్టిపికెట్స్ ఉన్న డీలర్లు మాత్రమే ఫెర్టిలైజర్స్ షాపులు నిర్వహించేందుకు అర్హులని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని ఫెర్టిలైజర్ షాపులు నడుపుతున్న వారు సద్వినియోగించుకోవాలని కోరారు. సదస్సులో వ్యవసాయ సంభందిత సైంటిస్ట్ డాక్టర్ బీ వెంకటేశ్వరరావు, డీలర్లు పాల్గొన్నారు.

42
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles