భర్త ఇంటి ఎదుట భార్య బైఠాయింపు

Mon,August 12, 2019 12:41 AM

పాల్వంచ : వేరే మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకొని తనను వద్దంటున్న భర్త ఇంటి ఎదుట పాల్వంచ పట్టణంలోని ఇందిరాకాలనీలో భా ర్య బైఠాయించిన సంఘటనిది. బాధితురాలి కథనం ప్రకారం.. ఇందిరాకాలనీకి చెందిన ద్రాక్ష వాసుకు ర్గంపాడు మండలంలోని సారపాకకు చెందిన చిలకాని సునీతను 2018లో వివాహమై ఓ పాప జన్మించింది. తరచూ గొడవలు జరుగుతుండేవి. పెళ్లికి ముందే మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని వేధిస్తున్నాడు.

అదనపు కట్నం తేవాలని లేక పోతే విడాకులు ఇవ్వాలంటూ చిత్ర హింసలకు గురిచేయడంతో గత్యంతరం లేని పక్షంలో సారపాకలో ఉంటే తల్లిందండ్రుల వద్దకు పోయినట్లు బాధితురాలు పేర్కొంది. ఈ నేపధ్యంలో బాదితురాలు సునీత తన తల్లి, కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఇందిరాకాలనీలోని భర్త వాసు ఇంటి ముందు బైఠాయించి ఆందోళన చేపట్టింది. పట్టణ పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకుని బాధితురాలికి న్యాయం చేస్తామని, పెద్దల సమక్షంలో మరో సారి కూర్చుని మాట్లాడుకోవాలని సర్ధిచెప్పారు. అయినా ఆమె వినిపించుకోకుండా భర్త ఇంటి ముందే దీక్ష కొనసాగిస్తోంది.

46
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles