పిల్లలు సాహిత్యం పైపు దృష్టిపెట్టేలా

Mon,August 12, 2019 12:40 AM

కొత్తగూడెం టౌన్: సమాజం మార్పునకు సాహిత్యం దిక్సూచిగా దోహదపడుతుందని, చిన్నతనం నుంచే సాహిత్యంలోని కవిత్వం, కథలు రాయడం మీలోని సృజనాత్మకతకు పదును పెట్టేందుకు కవితా, కథా కార్యశాల ఎంతో ఉపకరిస్తుందని బాలోత్సవ్ కన్వీనర్ డాక్టర్ వాసిరెడ్డి రమేష్‌బాబు అన్నారు. ఆదివారం కొత్తగూడెం క్లబ్‌లో రెండురోజుల పాటు జరిగే చిల్డ్రన్స్ కల్చరల్ సొసైటీ బాలోత్సవ్ ఆధ్వర్యంలో నిర్వహించే కథా, కవితా కార్యశాల ముగింపు సభలో ఆయన మాట్లాడారు. మానవత్వం విలువలు తగ్గిపోతున్న తరుణంలో బాలల సాహిత్యం కవితా, కథల పట్ల ఆసక్తిని పెంచుకొని భావితరాలకు విలువలతో కూడిన సాహిత్యం అందించాలని కోరారు. పక్కదారిలో పయనిస్తున్న సమాజ మార్పునకు మీ సహాయం మార్గనిర్దేశం కావాలని సూచించారు. పిల్లల ఊహలకు రెక్కలు పెద్దగా ఉంటాయని, వాటికి అక్షర రూపం దాల్చితే మంచి సాహిత్యం ఆవిష్కరణ అవుంతుందన్నారు. కలలు కని.. వాటిని సాకారం చేసుకోవాలని సూచించారు. మీకు నచ్చిన కవుల పుస్తకాలు చదవడం ద్వారా గత సాహిత్యానికి కొనసాగింపు సాహిత్యం రాయవచ్చని, గొప్ప వ్యక్తుల పుస్తకాలు చదవాలని, పరిశీలన ద్వారా కవిత్వం, కథలు రాయాలన్నారు.

కథలో 12 మంది, కవిత్వంలో వంద మంది విద్యార్థులు పాల్గొన్నారు. గతంలో నిర్వహించిన కవితా, కథా కార్యశాలలో పాల్గొని కవిత్వాలు, కథలు రాసిన కొంత మంది విద్యార్థులు రచనలతో కూడిన పుస్తకాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ ముగింపు సమావేశంలో ప్రతిభ కనబరిచిన వారికి మెంమెంటోలు, జ్ఞాపికలు అందజేశారు. కథల పోటీల్లో మొదటి బహుమతి ఓ దీక్షిత, ద్వితీయ బహుమతి శ్రీహిత, తృతీయ బహుమతి ఎన్ సంధ్య.., కవితల పోటీల్లో మొదటి బహుమతి లోహిత పద్మావతి, ద్వితీయ కే భావన, తృతీయ కే పవన్ కళ్యాణ్‌లను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవులు శిరంశెట్టి కాంతారావు, మండవ సుబ్బారావు, సురేష్‌బాబు, పైడిమర్రి రామకృష్ణ, మధు, భగవతం (మహర్షి), ముళ్లపూడి సుబ్బారావు, అనీల్‌డానీ, వీఆర్ శర్మ, మన్పూర్, ఉప్పాల కృష్ణమూర్తి, సూరి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

35
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles