అభివృద్ధిలో పినపాకను అగ్రభాగాన నిలుపుదాం..

Mon,August 12, 2019 12:39 AM

-పినపాక నియోజకవర్గ ప్రజాప్రతినిధుల సమావేశంలో ఎమ్మెల్యే రేగా కాంతారావు
మణుగూరు, నమస్తేతెలంగాణ: ప్రజాప్రతినిధులు గ్రామాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలని, ప్రజాసమస్యల పరిష్కారంలో ముందుండాలని పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఆయన ఆదివారం మణుగూరు పద్మశాలీ భవన్‌లో నిర్వహించిన పినపాక నియోజకవర్గ ప్రజాప్రతినిధుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అన్ని మండలాల్లోని రోడ్లు, వంతెనలను త్వరగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటానన్నారు. అభివృద్ధిలో పినపాక నియోజకవర్గాన్ని జిల్లాలోనే అగ్రభాగాన నిలుపుదామన్నారు. పులుసుబొంత, వట్టివాగు ప్రాజెక్టులు పూర్తిచేసి రైతులకు సాగునీళ్లు అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నానని పేర్కొన్నారు. అశ్వాపురం, బూర్గంపాడు మండలాల్లో ప్రతీ ఎకరానికి సాగునీరు అందించేందుకు కృషిచేస్తానన్నారు.

సీఎం కేసీఆర్ చొరవతో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. ప్రజాప్రతినిధుల పట్ల అధికారులు నిర్లక్ష్యం వహించినా, అత్యుత్సాహం ప్రదర్శించినా వెంటనే ఫిర్యాదు చేయాలన్నారు. ఈ సమావేశంలో మణుగూరు జడ్పీటీసీ పోశం నర్సింహారావు, బూర్గంపాడు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, కరకగూడెం జడ్పీటీసీ కొమరం కాంతారావు, కొమరం హనుమంతరావు, సూదిరెడ్డి సులక్షణ, జిల్లా కోఆప్షన్ సభ్యులు షరీఫ్, కారం విజయకుమారి, మంజుభార్గవి, రోశిరెడ్డి, గుమ్మడిగాంధీ, కాలిక, సుజాత, కీవీరావు, పగడాల సతీష్‌రెడ్డి, కంది సుబ్బారెడ్డి, పొనుగోటి భద్రయ్య, పుచ్చకాయల శంకర్, జావిద్‌పాషా, కుర్రి నాగేశ్వరరావు, వంశీకృష్ణ, మల్లారెడ్డి, అన్ని మండలాల వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు, జడ్పీటీసీలు, సొసైటీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

42
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles