రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్రగాయాలు

Sun,August 11, 2019 04:59 AM

దుమ్ముగూడెం:రోడ్డు ప్రమాదంలో ఓ మహిళకు తీవ్రగాయాలైన సంఘటన శనివారం చోటు చేసుకుంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం తీగనపల్లి గ్రామానికి చెందిన సున్నం కన్నమ్మ తన బంధువులతో కలిసి ద్విచక్రవాహనంపై దుమ్ముగూడెం మండలం ముల్కపాడు గ్రామానికి వచ్చింది. తిరిగి వెళ్తుండగా ముల్కపాడు గ్రామ సమీపంలో టా టా మ్యాజిక్ వాహనం వీరు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో సున్నం కన్నమ్మకు తలకు తీవ్రగాయమైంది. స్థానికులు ఆమెను ముల్కపాడు ఆస్పత్రికి తరలించారు.

36
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles