క్యాంటీన్‌లో సౌకర్యాలు కల్పించాలి

Sun,August 11, 2019 04:58 AM

రామవరం: సింగరేణి కొత్తగూడెం ఏరియా జీకేవోసీలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై వోసీ పీవో షాలెంరాజు, మేనేజర్ కరుణాకర్‌రావులతో టీబీజీకేఎస్ నాయకులు శనివారం చర్చించారు. రుద్రంపూర్ నుంచి జీకేవోసీ వెళ్లే వ్యాలీ రోడ్ ఇరువైపులా మట్టి వేయాలని, మ్యాన్ పవర్ పెంచాలని, రాబోయే కాలంలో ఓసీ పరిస్థితిపై చర్చించారు. కార్మికుల షూస్ ఇబ్బందికరంగా ఉన్నాయని, వెంటనే కొత్తవి తెప్పించాలని కోరారు. జీకేవోసీ రోడ్ సైడ్ లైటింగ్‌ను మెరుగుపరచాలని, హైవే రోడ్ నుంచి జీకేవోసీకి వచ్చే దారిలో ఫిల్టర్ బెడ్ దగ్గర రోడ్డు వేయాలని, కార్మికులను ట్రాన్స్‌ఫర్ చేయకుండా ఇక్కడే సర్దుబాటు చేయాలని, క్యాంటీన్ ఫెసిలిటీ మెరుగు పర్చాలని విన్నవించారు.

యాజమాన్యం సానుకూలంగా స్పందించిందని, వెంటనే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని టీబీజీకేఎస్ నాయకులు చెప్పారు. సమావేశంలో ఏరియా ఉపాధ్యక్షుడు ఎండీ రజాక్, 11మెన్ కమిటీ సభ్యుడు కాపు కృష్ణ, సెక్రటరీ భీముడు, ట్రెజరర్ గోపు కుమార్, రాములు, మంగ రమేష్, పోచం శ్రీనివాస్, కొమరయ్య, దరియా సింగ్, పిచ్చయ్య, శ్రీమన్నారాయణ, విజయ్‌కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

45
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles