మాజీ మంత్రి తుమ్మలను కలిసిన ఖమ్మం జడ్పీ చైర్మన్ కమల్‌రాజు

Sun,August 11, 2019 04:57 AM

దమ్మపేట: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావును ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజు శనివారం మండలంలోని గండుగులపల్లిలోని మాజీ మంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్‌గా కమల్‌రాజుతో పాటు చింతకాని, పెనుబల్లి జడ్పీటీసీలు పర్చగాని తిరుపతి కిషోర్, చెక్కిలాల మోహనరావును మాజీ మంత్రి సాదరంగా ఆహ్వానించారు. నూతనంగా ప్రజాప్రతినిధులుగా బాధ్యతలు చేపట్టిన వారిని అభినందించి శాలువాలతో సన్మానించారు. మాజీ మంత్రి తుమ్మలను కలిసిన వారిలో దమ్మపేట జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరావు, రైతు సమన్వయ సమితి సభ్యుడు దొడ్డాకుల రాజేశ్వరావు, బీసీ సంఘం నాయకులు మచ్చా శ్రీనివాసరావు, కాసాని నాగప్రసాద్ తదితరులు ఉన్నారు.

35
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles