కుమ్రం భీం ఆశయ సాధనకు కృషి చేయాలి

Sat,August 10, 2019 04:14 AM

ఇల్లెందు నమస్తే తెలంగాణ: ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఇల్లెందులో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఇల్లెందులోని టీఆర్‌ఎస్ నియోజకవర్గ కార్యాలయంలో భద్రాద్రి కొత్తగూడెం జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య కుమ్రంభీమ్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుమ్రంభీమ్ ఆశయాల కోసం ఆదివాసీలంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆదివాసీల ఉనికి అంతంత మాత్రంగానే ఉండేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆదివాసీలకు న్యాయం జరుగుతుందన్నారు. నాడు పాలకులు కుమ్రంభీమ్‌ను గుర్తించిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకా సీఎం కేసీఆర్ కొమరం భీంను ప్రత్యేకంగా గుర్తించి మ్యూజియంకు స్థలాన్ని కేటాయించారన్నారు. ఆదివాసీల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని, అది ఆచరణలో కొనసాగుతుందన్నారు.

ఆదివాసీలకు అనేక సంక్షేమ పథకాలు, హక్కులు సీఎం కేసీఆర్ కల్పించారన్నారు. గడిచిన ఐదేళ్ళలో ఆదివాసీలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందారని గుర్తు చేశారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్, ఆదివాసీ విద్యార్థి, ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. ఆదివాసీలంతా ఐక్యంగా ముందుకుసాగాలని, హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు ముక్తి కృష్ణ, తాటి భిక్షం, పూనెం సురేందర్, అరెం కిరణ్, మడుగు సాంబమూర్తి, కాకటి భార్గవ్, ఎండి కరీమ్, పూనెం శ్రీనివాస్, పూనెం సురేష్, సనప విష్ణు, అరెం లక్ష్మినారాయణ, ముత్తయ్య, యాకయ్య తదితరులు పాల్గొన్నారు.

38
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles