ఇన్నోవేషన్ కేంద్రం అభివృద్ధికి చర్యలు

Sat,August 10, 2019 04:14 AM

కొత్తగూడెం, నమస్తే తెలంగాణ: జిల్లాలో నాలెడ్జ్ అండ్ ఇన్నోవేషన్ కేంద్రాన్ని అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం డైరెక్టర్ రాజీవ్ రంజన్ ఆచార్య నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. యాస్పిరేషన్ జిల్లాగా ప్రకటించినందున కార్యాచరణ ప్రణాళికలు రూపొందించనున్నట్లు చెప్పారు. ఇన్నోవేషన్ కార్యక్రమాలను నాలెడ్జ్ అండ్ ఇన్నోవేషన్ కేంద్రానికి అనుసంధానం చేయడం వల్ల ఔత్సాహికులను ప్రోత్సహించడానికి అవకాశం ఉంటుందన్నారు. జిల్లాకు కేటాయించిన శిక్షణా ఐఏఎస్ అధికారులకు క్షేత్రస్థాయిలో పర్యటించి చేయాల్సిన పనుల గురించి తెలియజేయాలని డైరెక్టర్ రాజీవ్‌రంజన్ ఆచార్య కలెక్టర్‌కు సూచించారు.

43
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles