ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమానికి దరఖాస్తుల ఆహ్వానం

Sat,August 10, 2019 04:13 AM

క్షేత్రస్థాయి నుంచి ఆవిష్కరణలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమం ద్వారా ఔత్సాహికుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దరఖాస్తులు చేయడానికి శనివారం వరకు గడువు ఉందని కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవడానికి ఒక్క రోజు మాత్రమే అవకాశం ఉందని, వారి ఆవిష్కరణలను ఆగస్టు 10వ తేదీలోగా పూర్తి వివరాలతో 10-15 సెకన్ల పాటు ఉండే వీడియోతో ఆవిష్కరణ ఏ సమస్యను పరిష్కరిస్తుందో స్పష్టంగా 5 లైన్లు రాసి 9100678543 నంబర్‌కు వాట్సాప్ చేయాలన్నారు.

గ్రామీణ ప్రాంత రైతులు, విద్యార్థులు, యువత, నిరక్షరాస్యులెవరైనా దరఖాస్తు చేయవచ్చునని చెప్పారు. చింతకింది మల్లేశం ఆవిష్కరించిన ఆసుయంత్రం మాదిరిగా జిల్లాలో ఎవరైనా సాంకేతికపరమైన వినూత్న ఆలోచనలతో తయారు చేయబడిన యంత్రాలను వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. వచ్చిన దరఖాస్తులను రాష్ట్రస్థాయిలో ఇన్నోవేషన్ అధికారులు పరిశీలించి ఉత్తమ ఇన్నోవేషన్‌ను ప్రశంసా పత్రంతో పాటు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రదర్శించడం జరుగుతుందన్నారు.

57
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles