మధిర మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురేస్తాం..

Sun,July 21, 2019 12:15 AM

మధిర, నమస్తేతెలంగాణ, జూ లై 20: రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో మధిర మున్సిపాలిటీపై టీఆర్‌ఎస్ జెండా ఎగరడం ఖా యమని జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు పేర్కొన్నారు. శనివారం మధిర ము న్సిపాలిటీలోని 17వ వార్డులో ఆయన పాదయాత్ర నిర్వహించి ప్రజల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కొత్త మున్సిపాలిటీ చట్టం తీసుకువచ్చింది ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పధకాలు సకాలంలో అందించేదాని కోసమేనన్నారు. కొత్త పంచాయతీ చట్టమైనా, మున్సిపాలిటీ చట్టమైనా అది ప్రజలకు పధకాలు దగ్గర చేయడం సీఎం కేసీఆర్‌కే సాధ్యమన్నారు. మధిర మున్సిపాలిటీ అభివృద్ధికి టీఆర్‌ఎస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు దేవిశెట్టి రంగారావు, జిల్లా నాయకులు డాక్టర్ కోట రాంబాబు, శీలం వెంకటరెడ్డి, మొండితోక సుధాకర్, నాయకులు యన్నం కోటేశ్వరరావు, శీలం వీరవెంకటరెడ్డి, బాహాటం శ్రీనివాసరాజు, యర్రగుంట రమేష్, కుంచం కృష్ణారావు, బోగ్యం ఇందిర, బత్తుల శ్రీనివాసరావు, తేళ్ల వాసుదేవరావు, పల్లపోతు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

41
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles