అన్నారంలో వెట్న్ ప్రక్రియ షురూ

Sat,July 20, 2019 05:43 AM

మంథని, నమస్తే తెలంగాణ/మంథని రూరల్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కీలకమైన మంథని మండలం కాసిపేటలోని అన్నారం పంపుహౌస్‌లో మొదటి మోటర్ వెట్న్ ప్రక్రియ మొదలైంది. ఈ మేరకు ఇంజినీరింగ్ యంత్రాంగం శుక్రవారం సాయంత్రం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వ ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి, ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సాయంత్రం 6.30గంటలకు వేద పండితుల ప్రత్యేక పూజలు నడుమ పంపుహౌస్ ఇంజినీర్లు, సిబ్బంది మోటర్ వద్ద కొబ్బరికాయలు కొట్టి పూజలు చేసి ఈ ప్రక్రియను మొదలు పెట్టారు. వెట్న్‌ల్రో భాగంగా మోటర్ ఆర్‌పీఎంను పెంచుతూ తగ్గించుకుంటూ ప్యారా మీటర్స్‌ను చేంజ్ చేస్తూ మోటార్‌ను ఆన్‌చేసే ప్రయత్నం చేశారు. 50శాతం, 90శాతం వరకు పూర్తయ్యాక వివిధ రకాల పరీక్షలు చేశారు. అయితే ఈ సమయంలో చిన్న చిన్న లూజ్ కనెక్షన్స్‌ను సరి చేసేందుకు రాత్రి వేళలో కాకుండా శనివారం వెట్న్ చేయాలని నిర్ణయించినట్లు ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు వెల్లడించారు. శనివారం ఉదయం 10గంటల ప్రాంతంలో మోటర్‌ను ఆన్ చేసి, డెలివరీ సిస్టర్న్ ద్వారా నీటిని ఎత్తిపోసి పరీక్షిస్తామని అధికారులు చెప్పారు. అంతకు ముందు ఎస్‌ఎఫ్‌సీ పవర్ సైప్లె, కంట్రోల్ రూంల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఇక్కడ మెగా పీఎం జనార్ధన్, అన్నారం పంపు హౌస్ ఈఈ ఎలకొండ యాదగిరి, డీఈఈలు వల్లాల మధుసూదన్, వెంకటయ్య, ఏఈలు ఉన్నారు.

38
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles