డబుల్ ఇండ్లు త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

Sat,July 20, 2019 05:38 AM

ఖమ్మం నమస్తేతెలంగాణ: జిల్లాలో చేపడుతున్న డబుల్ బెడ్‌రూం గృహాల నిర్మాణాలను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాల పురోగతిపై సంబంధిత ఇంజనీరింగ్ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొణిజర్ల మండలంలో ఇప్పటికే పూర్తి చేసిన గృహాలను పంపిణీ చేసేందుకు గాను లబ్ధిదారులను ఎంపిక చేయాలని కలెక్టర్ ఆదేశించారు. తహసీల్దార్ల నుంచి స్వాధీనం చేసుకోవాల్సి స్థలాలను వెంటనే స్వాధీన పర్చుకొని ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ అన్నారు. గృహనిర్మాణాల పురోగతిని క్షేత్ర స్థాయిలో పర్యటించి త్వరితగతిన పూర్తయ్యేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా ముఖ్యమంత్రి హామీల కింద ఇప్పటికే పురోగతిలో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ అనురాగ్ జయంతి, అసిస్టెంట్ కలెక్టర్, ఇన్‌ఛార్జి జిల్లా పంచాయతీ అధికారి హన్మంతు కొడింబా, జిల్లా రెవెన్యూ అధికారి శిరీష, ఆర్ అండ్ బీ ఈఈ శ్యాంప్రసాద్, ఇరిగేషన్ ఈఈ నర్సింహరావు, సర్వశిక్ష అభియాన్ ఈఈ రవికుమార్, ఆర్‌డబ్లుఎస్ ఈఈ గిరిధర్, గిరిజన వెల్ఫేర్‌ఈఈ కోటిరెడ్డి, సీపీఓ సుబ్బారావు, తదితర శాఖల ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.

42
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles