రైతుల సమస్యల పరిష్కారానికి పెద్దపీట..

Sat,July 20, 2019 05:35 AM

ఖమ్మం రూరల్, నమస్తేతెలంగాణ, జూలై 19 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళనలో అర్హులైన రైతులందరికీ డిజిటల్ పాస్‌పుస్తకాలు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. అనుహ్యంగా ఎన్నికలు రావడంతో తహసీల్దార్లు బదిలీయ్యారు. గత ఏప్రిల్‌లో రూరల్ తహసీల్దార్‌గా వచ్చిన ఆశోకచక్రవర్తి తన విధులను సమర్థవంతంగా నిర్వర్తించి కేవలం నాలుగు నెలల కాలంలోనే 423 మంది రైతులకు పాస్‌పుస్తకాలు అందించి శభాష్ అనిపించుకుంటున్నారు. మొత్తం 604 దరఖాస్తులు రాగా అందులో 423 ఇప్పటికే ఇవ్వగా మరో 281మంది రైతులకు త్వరలో ఇవ్వనున్నారు. దీంతో పాటు వారానికి 20 నుంచి 30 వరకు మ్యూటేషన్ల కోసం ఆన్‌లైన్లో దరఖాస్తులు వస్తూనే ఉన్నాయి. ఒక వైపు ఎన్నికల విధులు, మరో వైపు నూతన పాస్‌పుస్తకాలకు ధరణిలో ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను సమర్థవంతగా నిర్వహించడంతో రూరల్ మండలంలోని రైతులు సంతోషపడుతున్నారు. రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్, నెట్ మోరాయించినా కలెక్టరేట్ సిబ్బందితో కలిసి అర్ధరాత్రి వరకు ధరణిలో ఆన్‌లైన్ చేయడంతో పాటు ఆన్‌లైన్‌లో పాస్‌పుస్తకాల కోసం వచ్చిన మ్యూటేషన్‌లు పెండింగ్ లేకుండా చేశారు. ఆర్‌ఐలు, వీఆర్‌వోలతో ప్రతివారం సమీక్ష సమావేశం నిర్వహించి పెండింగ్ లేకుండా జాగ్రత్త పడ్డారు. గతంలో నిర్వహించిన గ్రామ సభలు కాకుండా కలెక్టర్, జేసీ అనుమతి తీసుకుని రూరల్ మండలంలో మరోసారి రెవెన్యూ గ్రామసభలు నిర్వహించి రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించి వాటిని పరిష్కారించారు. రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురి చెయవద్దని సాధ్యమైనంత వరకు పనులు పూర్తి చేయాలని తహసీల్దార్ పలుమార్లు ఆదేశించారు. దీంతో ఎక్కడ కూడా వీఆర్‌వోలు నయా పైసా ఆశించకుండా పని చేయడంతోనే కేవలం నాలుగు నెలల కాలంలో నాలుగు వందల పాస్ పుస్తకాలు ఇచ్చి రికార్డు సృష్టించారు. రైతులు రిజిస్టేషన్ చేసుకున్న వెంటనే మీసేవలో దరఖాస్తు చేసుకున్న అనతికాలంలోనే నోటిస్ జనరేట్ చేసి వీఆర్‌వో, ఆర్‌ఐ రిపోర్టు ఆధారంగా నూతన ఖాతా నెంబర్ ఇవ్వడంతో పాటు వన్‌బీ, పహణీలను ఆన్‌లైన్ నమోదు చేసి పాస్‌పుస్తకం జారీ చేస్తున్నారు. ఈ పక్రియం అంతా పారదర్శకంగా నిర్వహిస్తున్నారు. వీఆర్‌వోలు కూడా వారి రెవెన్యూ గ్రామాల్లో భూ సమగ్ర సర్వే ప్రకారం మార్పులు, చేర్పులు చేసిన వివరాలు కొత్త పహాణిలు రాసి వాటిని ఆన్‌లైన్‌లో కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ల వద్ద అందుబాటులో ఉంచుతున్నారు. దీంతో పహాణిల్లో భూముల వివరాలను ట్యాంపరింగ్ చేసే అవకాశం లేకుండా ఆన్‌లైన్ పక్రియ నిర్వహిస్తున్నారు. దీంతో పాటు గతంలో కార్యాలయంలో వివిధ రకాల సర్టిఫికేట్ల కోసం అనేక మంది దరఖాస్తుదారులు ఇబ్బందులు పడేవారు ప్రస్తుతం ఎటువంటి దళారీ వ్యవస్థకు తావులేకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అనతికాలంలోనే సర్టిఫికేట్ వచ్చేలా రూరల్ రెవెన్యూ అధికారులు కృషి చేస్తున్నారు.

భూ సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యం..
రూరల్ మండలంలో సహజంగానే భూములు విలువ ఎక్కువగా ఉండటంతో అదే స్థాయిలో భూ సమస్యలు కూడా ఉంటాయి. ఇరు పక్షాల రైతుల సమస్యలు పరిష్కరించడం ఇక్కడ కత్తిమీదసామే. అన్ని రకాల వత్తిళ్లు వచ్చినా తలొగ్గకుండా అర్హులైన వారికి వర్తించేలా విధులు నిర్వర్తిచడంలో తహసీల్దార్ ఆశోకచక్రవర్తి తనదైనశైలీలో సమస్యలు పరిష్కరిస్తున్నారు. మండలంలో మద్దులపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న మార్కెట్, గ్రీన్‌ఫీల్డ్ రహదారులకు భూ సేకరణ వంటి పనులు నిర్వర్తిస్తూనే మరో వైపు ధరణిలో మ్యూటేషన్‌లను తమ లాగిన్‌లో జీరో అయ్యే విధంగా బాధ్యతలను నిర్వర్తించడంలో చురుకుగా పని చేస్తున్నారు.

పారదర్శకత పాటించడమే నా కర్తవ్యం..
కలెక్టర్ ఆదేశాల మేరకు కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యలు విని వాటిలో పారదర్శకత పాటించడమే నా కర్తవ్యం. ఏప్రిల్‌లో నేను రూరల్ తహసీల్దార్‌గా వచ్చినప్పుడు చాల ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని త్వరితగతని పూర్తి చేసి రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా మ్యూటేషన్లు చేశాం. సర్వే, ఇతర సమస్యలపై సైతం స్పందించి వెంటనే పరిష్కారానికి కృషి చేశా. ఎటువంటి వత్తిళ్లు వచ్చినా న్యాయం వైపే ఉంటూ సమస్యలు పరిష్కరించాం. నాతో పాటు మా సిబ్బంది అందించిన సహకారం గొప్పది. తహసీల్ కార్యాలయంలో ఆన్‌లైన్ పని చేయకపోయిన కలెక్టర్ కార్యాలయంలో నమోదు చేశాం. మ్యూటేషన్లు జీరో చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నా.
-అశోకచక్రవర్తి, ఖమ్మం రూరల్, తహసీల్దార్

47
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles