బాలలను స్వరాష్ర్టానికి తరలించడానికి ఏర్పాట్లు చేయాలి

Fri,July 19, 2019 03:11 AM

ఖమ్మం వ్యవసాయం: గతరాత్రి నవజీవన్ ఎక్స్‌ప్రెస్ రైల్‌నుంచి రిస్క్యూ చేసిన 29మంది బాలలను వారి స్వరాష్ర్టానికి పంపేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ చైల్డ్‌లైన్, డీడబ్యూఓ, డీసీపీఓలను ఆదేశిం చారు. గురువారం నగరంలోని బాలల సదనాన్ని కలెక్టర్ సందర్శించారు. రిస్క్యూ చేసిన పిల్లలను డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శితో వినోద్‌కుమార్‌తో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా సదరు పిల్లలతో కలెక్టర్ ముచ్చ టించారు. వారి పూర్తి వివరాలతో పాటు ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మధ్యప్రదేశ్ రాష్ట్రం బాలకోట్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించి ఆ జిల్లా పాలన అధికారితో కలెక్టర్ ఫోన్‌లో మాట్లాడారు. బాలలు బాలకోట్ ప్రాంతం వారీగా కలెక్టర్ అక్కడ కలెక్టర్‌తో తెలిపారు. కేజీబీవీ, యూఆర్‌ఎస్ తరహాలో పాఠశాలలలో అడ్మిషన్లు ఇప్పించే విధంగా చూడాలని కలెక్టర్ కోరారు. ఈ రిస్క్యూ ఘటనకు సంబంధించిన నివేదికను తయారుచేసి త్వరతగతిన అందించాలని చైల్డ్‌లైన్, డీబ్యూఓ, డీసీపీఓలను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమశాఖ అధికారిణి ఎం సబిత, చైల్డ్‌లైన్ జిల్లా సమన్వయకర్త కే శ్రీనివాస్, డీసీపీఓ విష్ణువందన, ఆర్‌పీఎఫ్ సీఐ మధు కుమార్, ఎస్పై వెంకటరెడ్డి, బాలలసదనం సూఫరిండెంట్ వరలక్ష్మి, సీడబ్యూసీ మెంబర్ రాజేశ్వరీ, ఆఫరేషన్ ముష్కాన్ టీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

35
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles