విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవాలి: పీవో

Fri,July 19, 2019 03:11 AM

కొణిజర్ల, జూలై18: విద్యార్థులు తరగతి గదుల్లో పాఠాలతో పాటు, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించినప్పుడే వారిలో మేధాశక్తి పెరిగి సబ్జెక్టులను సులభంగా అర్థం చేసుకోగలుగుతారని, తద్వారా వారికి బంగారు భవిష్యత్ ఏర్పడుతుందని ఐటీడీఏ పీవో వీపిగౌతమ్ అన్నారు. గురువారం మండలంలోని తనికెళ్ల గురుకుల స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెంట్ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఐఐటీ తరగతులు నిర్వహించే ఉపాధ్యా యులు ప్రతి విద్యార్థికి క్షేత్ర సందర్శన ద్వారా శిక్షణ ఇస్తే త్వరితగతిన అవగతమవుతుందన్నారు. సబ్జెక్టుల్లో చురుకుదనం లేని విద్యార్థులకు ఒకటికి రెండుసార్లు ప్రత్యేక తరగతులు నిర్వహించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని, వసతి సౌకర్యాలు మెరుగు పర్చాలన్నారు. శిక్షణలో ఉపాధ్యాయులు నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రిన్సిపాల్ ప్రసాదరావు మాట్లాడుతూ ఐఐటీ 8వ తరగతి నుంచి ప్రతి రోజు రెండు గంటల పాటు శిక్షణ ఇస్తూ ప్రతి ఆది వారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల ప్రతిభకు అనుగుణంగా అదనపు తరగతులు నిర్వహించి పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొ న్నారు.

38
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles