భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా వాన..

Fri,July 19, 2019 03:10 AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ :వర్షాకాలం ప్రారంభమై రోజులు గడుస్తున్నా వానలు కురువక అన్నదాతలు వెయ్యికళ్లతో వర్షం కోసం ఎదురుచూస్తూ వచ్చారు... గురువారం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో చిరుజల్లుల నుంచి ఒక మోస్తరు వరకు వర్షం పడింది. దీంతో అన్నదాతలు తాము వేసిన విత్తనాలు మొలకెత్తేందుకు ఈ వర్షం కొంత ఆసరా అవుతుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ శాఖ రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని ముందస్తు హెచ్చరికలు జారీ చేయడంతో రైతులంతా ఆ భారీ వర్షాల కోసం వేచి చూస్తున్నారు. గత ఏడాదితోపోలిస్తే జిల్లాలో అత్యల్ప వర్షపాతం నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో రైతులు విత్తనాలు కూడా వేయలేదు. వరినార్లు పోయలేదు. దీంతో జిల్లాలో సాగువిస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. బంగాళా ఖాతంలోని వాయువ్య ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినందున రానున్న రెండుమూడ్రోజుల్లో అల్పపీడనం ఏర్పడి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో మధ్యాహ్నం వరకు వాతావరణం మళ్లీ వేసవిని మరి పించినా సాయంత్రం ఒక్కసారిగా చల్లబడి ఒక మోస్తరు వర్షం పడింది. జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు, భద్రాచలం నియోజకవర్గాల్లో వర్షంకురిసింది. అశ్వారావుపేట నియోజకవర్గంలో సాయంత్రం వరకు ఆకాశం మే ఘావృతమై వర్షం పడే అవకాశం ఉంది. జిల్లా వ్యా ప్తంగా వర్షంతో పాటు పిడుగులు పడి ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. రెండు దుక్కిటెడ్లు, 13 మేకలు మృతి చెందాయి. బూర్గంపాడు మండలంలోని పినపాక పట్టినగర్ గ్రామంలో దోమల సుందరం అనే రైతు పొలంలో దుక్కి చేస్తుండగా పిడుగుపడి రెండు దుక్కిటెడ్లతో పాటు అతను కూడా మృత్యువాత పడ్డాడు. అదేవిధంగా టేకులపల్లి మండలం లోని బర్లగూడెం గ్రామానికి చెందిన ఎల్లబోయిన రవళి (23), ఒడ్డుగూడెం గ్రామానికి చెందిన బండా అనూష (25)లు పిడుగుపడి మృత్యువాత పడ్డారు. బూర్గంపాడు మండలం పాతపినపాకకు చెందిన అన్నపురెడ్డి ముత్తయ్య, వెంకటేషంలకు చెందిన 13 మేకలు మృత్యువాత పడ్డాయి.

67
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles