పురపోరుకు సన్నద్ధం

Thu,July 18, 2019 04:06 AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని పురపాలక సంఘాల ఎన్నికలకు జిల్లా యంత్రాంగం సమాయత్తమవుతోంది. ఎన్నికల సంఘం నుంచి నోటిఫికేషన్ వెలువడగానే ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే వార్డుల విభజన, కులాల వారీగా ఓటర్ల జాబితా విడుదల చేసిన అధికారులు, పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుపై వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం సైతం నిర్వహించారు. జిల్లాలో మొత్తం నాలుగు మున్సిపాలిటీలు ఉండగా మణుగూరు, పాల్వంచ మున్సిపాలిటీలపై కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండటంతో ఈ మున్సిపాలిటీల్లో మినహా మిగిలిన కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీలలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన రిటర్నింగ్ ఆఫీసర్లకు ఇటీవల శిక్షణ ఇచ్చారు. మిగిలిన ఎన్నికల సిబ్బందికి త్వరలోనే శిక్షణ, అవగాహన కల్పించనున్నారు.

కులాల వారీగా ఓటర్ల జాబితా ప్రకటన పూర్తి..
ఇప్పటికే జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర కులాల వారీగా ఓటర్ల తుది జాబితాను సైతం ప్రకటించారు. ఓటర్ల జాబితాపై వచ్చిన అభ్యంతరాలను పూర్తిస్థాయిలో పరిశీలించి, సవరణలు చేసి తుది జాబితాను ప్రకటన చేశారు. ఇక తర్వాత ప్రక్రియ అయిన పోలింగ్ కేంద్రాలను సైతం పరిశీలించి, పోలింగ్ కేంద్రాల పేర్లను తెలిపి, వాటిపై ఉన్న అభ్యంతరాలపై రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. వీటిపై అభ్యంతరాలను 19వ తేదీలోపు చెప్పాలని, సలహాలు, సూచనలు స్వీకరించిన అనంతరం ఈ నెల 21న పోలింగ్ కేంద్రాలను సైతం వార్డుల వారీగా విడుదల చేయనున్నారు. కొత్తగూడెంలో 36 వార్డులకు 87పోలింగ్ కేంద్రాలు, ఇక ఇల్లెందులోని 24వార్డులకు 49పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొత్తగూడెంలో ఓటర్ల తుది జాబితాలో మొత్తం ఓటర్లు 59,628 ఉండగా, మహిళలు 31,029, పురుషులు 28,590, థర్డ్ జెండర్ 9మంది ఓటర్లుగా ఉన్నారు. ఎస్సీలు 13,392మంది కాగా ఇందులో మహిళలు 7,105, పురుషులు 6,287, ఎస్టీ ఓటర్లు మొత్తం 3,365కాగా మహిళలు 1,804, పురుషులు 1,561, బీసీ ఓటర్లు 33,886కాగా మహిళలు 17,648, పురుషులు 16,238, థర్డ్ జెండర్స్ 9మందిగా, ఓసీలు 8,928కాగా మహిళలు 4,443, పురుషులు 4,485మంది ఓటర్లు ఉన్నారు.

ఇల్లెందు మున్సిపాలిటీలో ఓటర్ల తుది జాబితాలో మొత్తం ఓటర్లు 31,759ఉండగా, మహిళలు 16,371, పురుషులు 15,388మంది ఓటర్లుగా ఉన్నారు. ఎస్సీలు 5,202మంది కాగా ఇందులో మహిళలు 2,767, పురుషులు 2,435, ఎస్టీ ఓటర్లు మొత్తం 2,069కాగా మహిళలు 1,134 , పురుషులు 935, బీసీ ఓటర్లు 21,500కాగా మహిళలు 11,011, పురుషులు 10,489, ఓసీలు 2.079కాగా మహిళలు 1,408, పురుషులు 1,471మంది ఓటర్లు ఉన్నారు.

బ్యాలెట్ పత్రాలతోనే ఎన్నికలు..
మున్సిపల్ ఎన్నికలు బ్యాలెట్ పత్రాలతోనే జరగనున్నాయి. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బ్యాలెట్ పత్రాలతోనే ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సమాయత్తమయింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన అనంతరం నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ జరిగిన తర్వాత బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితా ప్రకటించి దాని ఆధారంగా బ్యాలెట్ పత్రాలపైన అభ్యర్థుల పేరు, పార్టీ పేరు, గుర్తును ముద్రించనున్నారు. ముద్రణలో ఎక్కడా తప్పులు, పొరపాట్లు దొర్లకుండా గతంలో ఎన్నికలు నిర్వహించి విజయవంతం చేసిన సిబ్బందికే మున్సిపల్ బాధ్యతలను కలెక్టర్ అప్పగించారు. దీంతో ఈ ఎన్నికలు కూడా సజావుగా జరిగేందుకు ఇప్పటి నుంచే అధికారులు కసరత్తు ప్రారంభించారు.

వార్డుల వారీగా ఎన్నికలకు ప్రత్యేక అధికారుల నియామకం..
మున్సిపల్ ఎన్నికలకు ప్రత్యేక అధికారుల నియమక ప్రక్రియ పూర్తయింది. కలెక్టర్ రజత్‌కుమార్‌శైనీ సారథ్యంలో ఎన్నికల నిర్వహణకు జిల్లా అధికారులందరూ సమాయత్తమయ్యారు. ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల నోటిపికేషన్ జారీ ప్రక్రియ నుంచి ఎన్నికలు ముగిసేంత వరకు ప్రత్యేక అధికారులు వారికి కేటాయించిన విధులను అంకిత భావంతో నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని, నోడల్ అధికారులకు కేటాయించిన విధులపై అవగాహన కల్పించుకొని ఎటువంటి అలసత్వం వహించకుండా విధులు నిర్వహించాలని ఆదేశించారు. కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ అరిగెల సంపత్‌కుమార్, ఇల్లెందు మున్సిపల్ కమిషనర్ సరస్వతి ఎప్పటికప్పుడు మున్సిపాలిటీ పరిధిలో క్షేత్రస్థాయిలో పర్యటించి పోలింగ్ కేంద్రాలను, రాజకీయపార్టీల నాయకులతో సమావేశాలు, మున్సిపల్ సిబ్బందికి సూచనలు చేస్తూ ఎప్పటికప్పుడు కలెక్టర్‌కు సమాచారం అందిస్తున్నారు. వార్డుల వారీగా ఎన్నికల్లో అధికారులను నియమించారు. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో 1,2,3వార్డులకు జి.భాస్కర్‌రావు(ఎస్‌ఆర్‌ఎల్‌ఐపీ ఏఈఈ), 4, 5, 6వార్డులకు ఎం.అప్పారావు(ఎస్‌ఆర్‌ఎల్‌ఐపీ, డీఈఈ), 7,8,9వార్డులకు ఎస్‌కె.గఫూర్‌పాషా(ఎస్‌ఆర్‌ఎల్‌ఐపీ, ఏఈఈ), 10,11,12వార్డులకు ఎం.గణేష్‌నాయక్(ఎస్‌ఆర్‌ఎల్‌ఐపీ, డీఈఈ), 13,14,15వార్డులకు బీవీ.గోవిందరాజులు(ఎస్‌ఆర్‌ఎల్‌ఐపీ, ఏఈఈ), 16,17,18వార్డులకు డి.రమేష్(ఎస్‌ఆర్‌ఎల్‌ఐపీ, ఏఈఈ), 19,20,21 వార్డులకు డి.శ్రీరాంచరణ్(ఎస్‌ఆర్‌ఎల్‌ఐపీ ఏఈఈ), 22,23,24వార్డులకు కె.శ్యామ్‌బాబు(ఎస్‌ఆర్‌ఎల్‌ఐపీ ఏఈఈ) , 25,26,27 వార్డులకు ఏ.రంజిత్‌కుమార్(ఎస్‌ఆర్‌ఎల్‌ఐపీ, ఏఈఈ), 28,29,30 వార్డులకు కె.విజయ్‌కుమార్(ఎస్‌ఆర్‌ఎల్‌ఐపీ, ఏఈఈ) , 31,32,33 వార్డులకు ఎం.నిరోష(ఎస్‌ఆర్‌ఎల్‌ఐపీ, ఏఈఈ), 34,35,36 వార్డులకు పి.రాధ(ఎస్‌ఆర్‌ఎల్‌ఐపీ, ఏఈఈ)లను నియమించారు. వీరితో పాటు మరో నలుగురు టి.రాజమణి ఊర్మిళ, జె.రాధిక, డి.సరస్వతి, టి.సంధ్యరాణిలను (ఎస్‌ఆర్‌ఎల్‌ఐపీ ఏఈఈ) రిజర్వ్ అధికారులుగా నియమించారు.

ఇల్లెందు మున్సిపాలిటీలో 1,2,3 వార్డులకు పి.శ్రీనివాసరావు(ఎంఈఓ, ఇల్లెందు), 4, 5, 6వార్డులకు ధరావత్ మోతిలాల్(ఆర్ అండ్ బీ, ఏఈఈ), 7,8,9వార్డులకు రాము(ఎన్‌పీడీసీఎల్, ఏఈ), 10,11,12వార్డులకు రాంబాబు(ఆర్ అండ్ బీ, ఏఈ), 13,14,15వార్డులకు భాగ్యరాజ్ రాథోడ్(ఇరిగేషన్ డిపార్టుమెంట్, ఏఈ), 16,17,18వార్డులకు ఆర్.వెంకటనారాయణ (పీజీహెచ్‌ఎం, జేబీఎస్ స్కూల్, ఇల్లెందు), 19,20,21 వార్డులకు వెంకటేశ్వర్లు(డిప్యూటీ ఈఈ, ఆర్ అండ్ బీ), 22,23,24వార్డులకు (రాములు, డిప్యూటీ ఈఈ, ఐటీడీఏ)లతోపాటు మరో ముగ్గురు సత్యనారాయణ(ఏటీడబ్ల్యూఓ), కొండల్‌రావు(డిప్యూటీ ఈఈ, ఇల్లెందు మున్సిపాలిటీ), ఏ.అనిల్(ఇల్లెందు మున్సిపాలిటీ ఏఈ)లను రిజర్వ్‌గా నియమించారు.

60
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles