టీఎస్ ఐ-పాస్‌లో రూ.7కోట్లతో 91 మందికి ఉపాధి

Thu,July 18, 2019 04:05 AM

- కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ
కొత్తగూడెం, నమస్తే తెలంగాణ: టీఎస్-ఐపాస్ ద్వారా రూ.7 కోట్లతో 91 మందికి ఉపాధి కలుగనుందని కలెక్టర్ రజత్‌కుమార్‌శైనీ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఇండస్ట్రియల్ ప్రమోషన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో యూనిట్ల స్థాపన, యూనిట్ల మంజూరుపై కమిటీతో కలెక్టర్ సమీక్షించారు. 11 యూనిట్ల స్థాపనకు 15 అప్రూవల్స్ రాగా, 8 ఆమోదించారని, మూడు పరిశీలనలో ఉన్నాయన్నారు. మూడు ఆబ్జక్షన్‌లో ఉండగా మరొకటి తిరస్కరించినట్లు జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ టి.సీతారాం కలెక్టర్‌కు నివేదించారు. అంనతరం కలెక్టర్ మాట్లాడుతూ.. దరఖాస్తుల పరిశీలన పది రోజుల్లో చేయాలన్నారు. స్క్రూట్నీ చేసిన దరఖాస్తులను బ్రాంచీల వారీగా హార్డ్ కాపీలను ప్రింట్ చేసి ఆయా బ్యాంకులకు పంపాలన్నారు. ఎస్సీలకు రూ.19 లక్షల సబ్సిడీని ఆరు యూనిట్లకు, ఎస్టీలకు రూ.52 లక్షలతో 17 యూనిట్లకు సబ్సిడీలను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జుగల్‌కిషోర్ పరిశ్రమల స్థాపనకు సహకరించాలన్నారు. జిల్లాలో ధాన్యం ఉత్పత్తి ఎక్కువగా ఉందని, రైస్ మిల్లుల కొరత వలన ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తుందని, వ్యాపారులకు సహకరిస్తే రైస్ మిల్లులను తామే స్థాపిస్తామన్నారు.

పప్పు మిల్లులు, కారం మిల్లుల కొరత కూడా ఉందని, జిల్లాలో 200 ఎకరాలు పరిశ్రమల పార్కు స్తాపనకు మంజూరు చేస్తే జిన్నింగ్‌మిల్స్, కోల్డ్ స్టోరేజీల నిర్మాణం చేపడతామని కురిచేటి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. సీతారామా ప్రాజెక్టు స్థాపనతో వరి సాగు మరింత పెరిగే అవకాశం ఉందని, ఇతర పంటలకు ఇజల్లాలో పుష్కలంగా వనరులున్నాయన్నారు. సత్తుపల్లి రైల్వే లైన్ పరిశ్రమలకు కూడా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. తదనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో అవసరాలకు అనుగుణంగా పరిశ్రమల స్థాపనకు సంబంధించిన రిప్రజెంటేషన్స్ ఇవ్వాలని ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు అందజేస్తామన్నారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ టి.సీతారాం, ఆర్డీవో స్వర్ణలత, ఆర్‌టీవో జైపాల్‌రెడ్డి,ఎస్సీ కార్పోరేషన్ ఈడీ పులిరాజు, ఏపీ ఎస్‌ఎఫ్‌సీ అధికారి జగదీశ్వర్, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జుగల్ కిషోర్, కురిచేటి శ్రీనివాసరావులు పాల్గొన్నారు.

43
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles