అంగన్‌వాడీ టీచర్, ఆయాలకు శుభవార్త

Wed,July 17, 2019 04:00 AM

ఖమ్మం వ్యవసాయం , జూలై 16: అంగన్‌వాడీ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న టీచర్లు, ఆయాలకు మరోమారు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ప్రస్తుతం 90 రోజులు ఉన్న సెలవుల నిబంధనను సవరిస్తూ 180 రోజులకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే సోమవారం రాత్రి తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కేంద్రాల్లో పని చేస్తున్న సిబ్బందికి మరింత వెసులుబాటు కలిగినైట్లెంది. ప్రభుత్వం ఒక వైపు కేంద్రాల బలోపేతం చేస్తూనే మరో వైపు సిబ్బంది ఆర్థిక ఇబ్బందులను తీర్చుతుంది. స్వయాన సీఎం కేసీఆర్ అంగన్‌వాడీ టీచర్లతో సమావేశం అయ్యి వారి సమస్యలను తెలుసుకుని ఊహించని విధంగా అనతి కాలంలోనే రెండు సార్లు వేతనాలు పెంచారు. మెజార్టీ కేంద్రాలకు సొంతభవనాలు ఏర్పాటు చేయడం, అద్దె భవనంలోని కేంద్రాలకు కిరాయిలను పెంచారు. సిబ్బంది సమస్యలు దృష్టిలో వుంచుకొని ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 90 రోజులుగా ఉన్న సెలవులను 180 రోజులకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే దీర్ఘకాలిక సెలవులు టీచర్లు, ఆయాలు పెట్టుకున్నైట్లెతే కేంద్రాన్ని నడిపించే అవకాశం స్థానిక మహిళలకు కల్పిస్తారు. సెలవు దినాలకు సిబ్బందికి ఇచ్చే గౌరవ వేతనం సదరు మహిళకు ఇవ్వనున్నారు. కేంద్రంలో పని చేస్తున్న సిబ్బంది బిడ్డలకు, తల్లితండ్రులు ఆనారోగ్యం బారిన పడిన సందర్భంలో సైతం సెలవులు పెట్టుకునే వెసులుబాటు కలిగిస్తూ ఉత్తర్వులలో పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల జిల్లావ్యాప్తంగా అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల నుంచి హర్షాతిరేఖాలు వ్యక్తం అయ్యాయి.

76
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles