రాష్ట్ర ప్రజలంతా టీఆర్‌ఎస్ వైపే..

Wed,July 17, 2019 03:59 AM

పెనుబల్లి, జూలై 16: రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించనున్న సందర్భంగా పార్టీలోకి ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా చేరుతున్నారని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, డీసీసీబీ మాజీ ఛైర్మన్ మువ్వా విజయ్‌బాబులు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని రామచంద్రరావుబంజరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు కోమటి వెంకటేశ్వరరావు, సీపీఎం పార్టీ నాయకులు పంది తిరుపతయ్యలతో పాటు పలు కుటుంబాల వారు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వీరిని మువ్వా విజయ్‌బాబు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సండ్ర, మువ్వాలు మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలకు ఆకర్షితులై రాష్ట్రవ్యాప్తంగా స్వచ్ఛందంగా పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు చెక్కిలాల లక్ష్మణ్‌రావు, ఎంపీపీ చీకటి బేబి శకుంతల రామారావు, జడ్పీటీసీ చెక్కిలాల మోహన్‌రావు, ఎంపీటీసీ కనగాల సురేష్‌బాబు, సర్పంచ్‌లు లక్కినేని శ్యామలాదేవి, మామిడి మైసయ్య, కోఆప్షన్ సభ్యుడు ఎస్‌కే గౌస్, పాతకారాయిగూడెం సొసైటీ చైర్మన్ చింతనిప్పు శ్రీనివాసరావు, నాయకులు కనగాల వెంకటరావు, చీకటి రామారావు, లక్కినేని వినీల్, కోమటి ప్రసాద్, తాళ్లూరి శేఖర్‌రావు, వంగా గిరిజాపతి, తాళ్లూరి రవి, ఎడ్ల వెంకటేశ్వరరావు, విపిరిశెట్టి రాము, బండి రాఘవులు, కాకా సీతారాములు, గువ్వల వెంకటరెడ్డి, యలమర్తి శ్రీను, వేముల కృష్ణయ్య పాల్గొన్నారు.

41
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles