సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం

Mon,July 15, 2019 02:53 AM

కొత్తగూడెం అర్బన్ : కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో ఇంటి క్రమబద్ధీకరణ పట్టాల జీవో 76ను తీసుకువచ్చి ఇంటి యాజమాన్యపు హక్కులు కల్పించేందుకు కృషి చేసిన సీఎం కేసీఆర్‌కు కొత్తగూడెం పట్టణ ప్రజలందరూ రుణపడి ఉంటారని టీఆర్‌ఎస్ నాయకుడు ఎండీ యాకూబ్ అన్నారు. ఈ మేరకు శనివారం బూడిదగడ్డలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేసి మాట్లాడారు. దశాబ్దాలుగా ఇంటి క్రమబద్ధీకరణ పట్టాల సమస్య పెండింగ్‌లో ఉందని, ఇంటి యజమానుల సమస్యను అర్థం చేసుకున్న ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నికల్లో హామీ ఇచ్చి ఈ మేరకు ప్రభుత్వ సహకారంతో సాధించారన్నారు. దీంతో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యకు పరిష్కారం లభించిందన్నారు. కార్యక్రమంలో కొత్తగూడెం జడ్పీటీసీ గిడ్ల పరంజ్యోతిరావు, టీఆర్‌ఎస్ నాయకులు కాసుల వెంకట్, యాకూబ్‌పాషా, మాదా శ్రీరాములు, యూసుఫ్, సురేష్, తదితరులు పాల్గొన్నారు.

56
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles