జాతీయ మెగా లోక్ అదాలత్‌కు విశేష స్పందన

Mon,July 15, 2019 02:51 AM

కొత్తగూడెం లీగల్ : లోక్ అదాలత్ అంటే ప్రజా న్యాయపీఠమని, ప్రజల కోసం రూపొందించిన చట్టమని, దేశవ్యాప్తంగా అనేక కేసులు పెండింగ్‌లో ఉన్నందున ఎక్కువ శాతం కేసులు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలని మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్, ఐదో అదనపు జిల్లా జడ్జీ జీ భువనేశ్వరిరాజు తెలిపారు. శనివారం లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో కొత్తగూడెం కోర్టు ఆవరణలో నిర్వహించిన జాతీయ మెగా లోక్‌అదాలత్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశంలో ఏ పౌరుడు ఆర్థిక అసమానతల కారణంగా న్యాయాన్ని పొందలేకపోతున్నారో వారిని దృష్టిలో ఉంచుకొని ఈ లోక్ అదాలత్‌లను ఏర్పాటు చేశాన్నారు.

కార్యక్రమంలో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జీ సీవీఎస్ సాయిభూపతి, అదనపు సీనియర్ సివిల్ జడ్జీ జీ శ్రీనివాస్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జీ జీవీ మహేష్‌నాథ్, రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేల్ పాలాది శిరీష, మూడో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేల్ పీ దేవిమానస, కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, ఎస్‌బీఐ రీజినల్ మేనేజర్ బీ శంకర్‌రెడ్డి, సఖి బాధ్యురాలు జీకే అన్నపూర్ణ, సభ్యులు కే పుల్లయ్య, జీ రాంచంద్రరెడ్డి, ఏ మనోరమ, ఎస్‌వీ రామారావు, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఊటుకూరి పురుషోత్తమరావు, న్యా యవాదులు, న్యాయశాఖ సిబ్బంది, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. రాజీపడిన న్యాయార్థులకు హరితహారం ద్వారా న్యాయమూర్తులు మొక్కలు పంపిణీ చేశారు.

లోక్‌అదాలత్‌లో 409 కేసులు పరిష్కారం
కొత్తగూడెంలోని వివిధ కోర్టులలో 409కేసులు పరిష్కారమయ్యాయి. సివిల్ కేసులు (దావాలు) రూ. 42.20లక్షలు, మనోవర్తి కేసులలో రూ.2.35లక్షలు, గృహహింస కేసులలో రూ.17.10లక్షలు, మోటార్ ఆక్సిడెంట్ ైక్లెయిమ్‌లలో రూ.17.35లక్షలు, ప్రిలిటిగేషన్ కేసులు రూ. 28.38లక్షలు, ప్రతివాదుల అంగీకారం మేరకు తీర్పులు లోక్ అదాలత్ ద్వారా తీర్పులు వెలువడ్డాయి. ఈ తీర్పులకు అప్పీలు లేదు. కార్యక్రమంలో కార్యవర్గసభ్యులు పీ నాగేశ్వరరావు, జీ మహేశ్వరరావు, అత్తులూరి మనోరమ, మునిగడప వెంకటేశ్వర్లు, మెండు రాజమల్లు, సీనియర్, జూనియర్, మహిళా న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

42
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles