రామాలయంలో నేడు తొలి ఏకాదశి వేడుకలు

Fri,July 12, 2019 02:27 AM

భద్రాచలం, నమస్తే తెలంగాణ : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఆషాఢ మాసోత్సవాలలో భాగంగా శుక్రవారం సందర్భంగా స్వామివారికి తొలి ఏకాదశి పూజలు నిర్వహించనున్నట్లు దేవస్థానం విశ్రాంత ప్రధాన అర్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు నమస్తే తెలంగాణకు తెలిపారు. ఉదయం స్వామివారికి అంతరాలయంలో మూలమూర్తులకు వజ్రవైడూర్య మరకత మాణిక్యములతో, బెంగుళూరు వారు స్వామివారికి సమర్పించిన రూ.5కోట్ల విలువ చేసే బంగారు కవచాలతో ఉత్సవ మూర్తులకు అంతరాయలంలో ఏకాంత తిరుమంజనం గావిస్తారు. తదుపరి ఉపాలయంలో వేంచేసి ఉన్న శ్రీలక్ష్మీతాయారు అమ్మవారికి పంచామృతాభిషేకం నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. మధ్యాహ్నం 3నుంచి సాయంత్రం 5గంటల వరకు ప్రాకార మండపంలో 108మంది భక్తురాళ్లచే విష్ణుసహస్రనామ పారాయణం 13 పర్యాయములు పఠించడం జరుగుతుందన్నారు. సాయంత్రం 5గంటలకు ఆరాధన, 6గంటలకు సంధ్యాహారతులు, 7గంటలకు రాజదర్భార్, 8గంటలకు తిరువీధిసేవ, 9గంటలకు చుట్టుసేవ, 10గంటలకు ఆరాధన, ఆరగింపు నిర్వహించనున్నట్లు విశ్రాంత ప్రధాన అర్చకులు వివరించారు.

25
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles