మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీని గెలిపించాలి

Fri,July 12, 2019 02:26 AM

మధిర, నమస్తేతెలంగాణ: రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో మాటలు చెప్పే పార్టీలను కాదు పనులు చేసి చూపే టీఆర్‌ఎస్ట్‌ని గెలిపించాలని జడ్పీచైర్మన్ లింగాల కమల్‌రాజు పేర్కొన్నారు. గురువారం మధిర మున్సిపాలిటీ పరిధిలోని 5, 6 వార్డుల్లో ఆయన పాదయాత్ర నిర్వహించి ప్రజల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టి అంతా మధిర అభివృద్ధి వైపే ఉందన్నారు. వారి సహాయ సహకారంతో మధిరను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. మధిర అభివృద్ధే ధ్యేయమని, మధిర మున్సిపాలిటీలో సమస్యల పరిష్కారం కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తానన్నారు.మధిర మున్సిపాలిటీ అభివృద్ధికి టీఆర్‌ఎస్ పార్టీ కట్టుబడి ఉంటుందని, మధిర మున్సిపాలటీపై గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మధిర పట్టణ అధ్యక్షుడు దేవిశెట్టి రంగారావు, జిల్లా నాయకులు డాక్టర్ కోట రాంబాబు, మొండితోక సుధాకర్, రైతుసమన్వయ సమితి మండల కన్వీనర్ యన్నం కోటేశ్వరరావు, నాయకులు తేళ్ల వాసుదేవరావు, చెరుకూరి నాగార్జున, బిక్కి కృష్ణప్రసాద్, పల్లపోతుల వెంకటేశ్వరరావు, డోకుపర్తి సత్యంబాబు, కపిలవాయి జగన్మోహన్‌రావు, యర్రగుంట రమేష్, బత్తుల శ్రీనివాసరావు, గుగులోతు కృష్ణ, బోగ్యం ఇందిర, యశోద, తదితరులు పాల్గొన్నారు.

34
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles